Facial Fat : ఫేషియల్ ఫ్యాట్‌తో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఇది మీకోసమే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాధారణంగా ముఖంపై గడ్డం చంపలు, కనుబొమ్మలు, దవడలు, మెడ చుట్టూ కొవ్వు నెమ్మదిగా పేరుకుపోవడం ప్రారంభిస్తుంది. రోజులు గడిచే కొద్దీ ముఖం ఉబ్బినట్టుగా కనిపిస్తుంది. ఇలా జరిగితే ముఖంపై కొవ్వు ఉన్నట్టే. ఇలా ఉండటం వలన ముఖం ఆకారంలో మార్పులు వచ్చి ఎబ్బెట్టుగా కూడా కనిపిస్తూ ఉంటుంది కొంతమందిలో. అందుకే ఇలా ఫేషియల్ ఫ్యాట్ రాకుండా జాగ్రత్తపడాలి. అసలు ఫేస్ ఫ్యాట్‌ను ఎందుకు తగ్గించుకోవాలి అంటే.. దానికి రెండు కారణాలు ఉన్నాయి. మొదటిది ముఖంపై కొవ్వు పెరగడం అంటే ఓబిసిటీ సమస్య వచ్చే అవకాశం ఉందని అర్థం. ఎందుకంటే శరీరంలో ఎలాంటి అనారోగ్యం ఉన్న ముందు అది కనిపించేది ముఖంలోనే కాబట్టి. ఇక ఫేస్ ఫ్యాట్ తొలగించుకోవడం నికి రెండో కారణం మంచి అప్పిరెన్స్ కోసం మనం ఎంత రెడీ అయినా ముఖం అర్ధంగా లేకపోతే ఏంటి ఉపయోగం? నిజానికి ఫేస్ ఫ్యాట్ రావడానికి చాలా కారణాలు ఉండవచ్చు.
Also Read : Beauty Tips: ముఖంపై మచ్చలు ఇబ్బంది పెడుతున్నాయా ?
ముఖ్యంగా జన్యువులు, హార్మోన్లు పరిమితికి మించి అల్కాహాల్ తీసుకోవటం, పొగ తాగటం, ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకపోవడం డీహైడ్రేషన్ ఫేస్ ఫ్యాక్ పెరగడానికి కారణం కావచ్చు. కారణాలైతే తెలుసుకున్నాం కానీ అసలు ఇలా ముఖంపై పేర్కొన్న కొవ్వుని ఎలా తగ్గించుకోవాలి అంటే దీని కోసం పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. తరచూ చేస్తే వ్యాయామాలతో పాటు మరికొన్ని ఇంటి చిట్కాలు పాటించడం ద్వారా మెరుగైన ఫలితాన్ని పొందవచ్చు. ఇంటి చిట్కాలు అనగానే మనకు మొదటి గుర్తొచ్చేది పసుపు. సౌందర్యం నుంచి ఆరోగ్యం వరకు మనకు ఎదురైన చాలా సమస్యలకు పసుపు పరిష్కారం చూపుస్తోంది. ముఖం మీద పేర్కొన్న కొవ్వును తొలగించే విషయంలోనూ పసుపు పనికొస్తుంది.
Also Read
- Pakistan: పాకిస్థాన్‌ను 15 'ముక్కలు' చేసేందుకు ఆర్మీ కుట్ర?.. దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు!
- Air India Fuel Surcharge Hike: విమాన ప్రయాణికులకు షాక్.. పెరగనున్న టికెట్ భారం..? కారణం ఇదే..
- Electric Tractors: రైతులకు గుడ్‌న్యూస్.. డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే ఈ-ట్రాక్టర్లతో 84% ఖర్చు ఆదా..!
- Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
Also Read : Tech Tips : మొబైల్ రేడియేషన్ నుంచి తప్పించుకోవాలంటే.. ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే
గిన్నెలో శనగపిండి, పెరుగు, కొద్దిగా పసుపు వేసి బాగా కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. బాగా ఆరిన తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల ముఖంపై చేరిన కొవ్వు తగ్గడంతో పాటు చర్మంపై ఉన్న ముడతలు, మచ్చలు, మొటిమలు తగ్గిపోతాయి. అంటే ఆరోగ్యంతో పాటు అందాన్ని కూడా మెరుగుపరచుకోవచ్చు. ఇక డబుల్ చిన్ ఉందంటే ఫేస్ ఫ్యాట్ ఉన్నట్టే. దాన్ని తగ్గించుకోవటడానికి పాలను ఉపయోగించవచ్చు. కొద్దిగా పచ్చి పాలనుతీసుకొని ముఖం, మెడకు రాసుకొని కాసేపు మసాజ్ చేసుకోవాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ చిట్కాలు పాటించడం ద్వారా డబుల్ చిన్న పోగొట్టుకోవచ్చు. అలాగే ప్రతిరోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడి నీటిలో నిమ్మరసం తేనే కలుపుకొని తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. ఇలా చేయడం వల్ల మెటబోలిసం ప్రక్రియ మెరుగుపడుతుంది.
బరువు తగ్గాలి అనుకునేవారికి సైతం ఈ చిట్కాలను పాటిస్తుంటారు. ఈ చిట్కా ఫేస్ ఫ్యాట్‌ను కూడా తగ్గిస్తుంది. కాబట్టి ప్రతి రోజు ఉదయాన్నే నిమ్మరసం, తేనె కలిపిన వేడి నీరు తాగడానికి ప్రయత్నించండి. కర్బూజా ఫేస్ ఫ్యాట్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. కర్బూజాలో విటమిన్ సీ ఉంటుంది. ఇది ఫేస్ ఫ్యాట్ తగ్గిస్తుంది. అలాగే శరీరంలోని టాక్సిన్‌లను బయటకు పంపిస్తుంది కాబట్టి ఆరోగ్యము మెరుగుపడుతుంది. రోజు ఒక గ్లాస్ కర్బూజా రసం తాగడం వల్ల ముఖంపై పేర్కొన్న కొవ్వు కరిగించుకొనివచ్చు. ఇక్కడ డార్క్ చాక్లెట్‌తో కూడా ఫేస్ ఫ్యాట్ తగ్గించుకోవచ్చు. సాధారణంగా చాక్లెట్ తింటే బరువు పెరిగిపోతామని భావిస్తుంటారు. కానీ డార్క్ చాక్లెట్ మాత్రం బరువు తగ్గేందుకు సహకరిస్తుంది. దీనిలో కోకోవా ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.
తాజావార్తలు
-
Pakistan: పాకిస్థాన్‌ను 15 ‘ముక్కలు’ చేసేందుకు ఆర్మీ కుట్ర?.. దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు!
-
MS Dhoni: రెండో టీ20 మ్యాచ్‌కు ఎంఎస్ ధోనీ.. ఆ స్టార్ ఓపెనర్ కోసమేనా?.. వైభవ్ కోసం కాదండోయ్!
-
Air India Fuel Surcharge Hike: విమాన ప్రయాణికులకు షాక్.. పెరగనున్న టికెట్ భారం..? కారణం ఇదే..
-
GV Prakash : బాలీవుడ్లో జీవీ ప్రకాష్‌కు టెస్టింగ్ టైం.. నయూ నవేలికి కంప్లీట్ మ్యూజిక్ ఇచ్చిన కంపోజర్
-
Electric Tractors: రైతులకు గుడ్‌న్యూస్.. డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే ఈ-ట్రాక్టర్లతో 84% ఖర్చు ఆదా..!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!