Reliance Jio Best Mobile Recharge Plans 2023: భారత టెలికాం రంగంలో రిలయన్స్ ‘జియో’ దూసుకుపోతోంది. ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌కు పోటీనిస్తూ కస్టమర్లను తనవైపుకు తిప్పుకుంటోంది. క్వాలిటీ నెట్‌వర్క్, అద్భుత డేటా ప్లాన్స్, అన్ లిమిటెడ్ ఆఫర్లతో ప్రస్తుత రోజుల్లో ప్రతీ ఒక్కరికీ జియో చేరువైంది. ప్రస్తుతం జియోలో ఎన్నో రీఛార్జ్ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. అందులో బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ఏవో ఓసారి చూద్దాం.
Jio 239 Plan:
ఈ ప్లాన్‌లో 28 రోజుల వాలిడిటీ ఉంటుంది. ఇందులో రోజువారీ డేటా పరిమితి 1.5 జీబీ కాగా.. రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, అపరిమిత కాల్‌లు వాడుకోవచ్చు. అన్ని జియో యాప్‌లకు ఉచిత సభ్యత్వం పొందవచ్చు. ఇది జియో చౌకైన ప్లాన్.
Jio Rs 589 Plan:
ఈ రీఛార్జ్ ప్లాన్ వ్యాలిడిటీ 56 రోజులు. ఈ ప్లాన్‌లో డైలీ 2 జీబీ డేటా, అపరిమిత కాలింగ్ మరియు 100 ఎస్‌ఎంఎస్‌లు కూడా లభిస్తాయి. కస్టమర్‌లు జియో సావ్న్ ప్రో మరియు జియో యాప్‌లకు ఉచిత సభ్యత్వాన్ని పొందుతారు.
Jio Rs 1099 Plan:
ఈ రీఛార్జ్ ప్లాన్ వాలిడిటీ 84 రోజులు. రోజుకు 2 జీబీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లు మరియు అపరిమిత ఉచిత కాలింగ్ ప్రయోజనాలను పొందుతారు. ఇక నెట్‌ఫ్లిక్స్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ అందుబాటులో ఉంటుంది.
Also Read: Rohit Sharma: నా బ్యాటింగ్ నాకే నచ్చలేదు: రోహిత్ శర్మ
Jio Rs 1559 Recharge Plan:
ఈ రీఛార్జ్ వాలిడిటీ 336 రోజులు. ఇందులో మొత్తంగా 24 జీబీ డేటా, 3600 ఎస్‌ఎంఎస్‌లు, అపరిమిత కాలింగ్ సదుపాయం ఉంటుంది. జియో యాప్‌లకు ఉచిత సబ్‌స్క్రిప్షన్ ఉన్నాయి. ఇది వాల్యూ ప్లాన్ విభాగంలో జాబితా చేయబడింది. తక్కువ డేటా అవసరం ఉన్నవారికి ఈ ప్లాన్ సరిపోతుంది.
Jio Rs 2999 Recharge Plan:
ఈ ప్లాన్ వ్యాలిడిటీ 365 రోజులు. ఇందులో రోజుకు 2.5 జీబీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లు మరియు అపరిమిత కాలింగ్ ప్రయోజనాలను పొందుతారు. ఇది అత్యంత ఖరీదైనది ప్లాన్.