ప్రెగ్నెన్సీ సమయంలో స్త్రీలను ఇబ్బందికి గురి చేసే ప్రధాన సమస్య గ్యాస్ట్రిక్. ప్రెగ్నెన్సీ సమయంలో హార్మోనుల మార్పుల వల్ల గ్యాస్ట్రిక్ సమస్య ఎక్కువగా వేధిస్తూ ఉంటుంది. దీంతో స్త్రీలు ప్రెగ్నెన్నీ సమయాన్ని ఎంజాయ్ చేయలేకపోతుంటారు. అంతేకాకుండా ఏ ఆహారాలు తినాలన్నా భయపడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే గ్యాస్ట్రిక్‌ను నివారించుకునేందుకు మందులు వాడుతుంటారు. అయితే ఇంట్లోనే గ్యాస్ట్రిక్ సమస్యకు చెక్ పెట్టే కొన్ని చిట్కాలు ఉన్నాయి. మరి ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Reliance JioBook Laptop: జియో మరో సంచలనం.. చీప్‌గా ల్యాప్‌టాప్
నీరు ఎక్కువగా తీసుకోవాలి
గర్భధారణ సమయంలో ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. నీటిని కూడా ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. శరీరంలో సరైన మోతాదులో వాటర్ లెవల్స్ ఉంటే.., తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. గర్భధారణ సమయంలో మహిళలు కనీసం 10 గ్లాసుల నీరు త్రాగాలి.
నడక లేదా వ్యాయామం
గర్భిణీ స్త్రీకి కడుపు ఉబ్బరం లేదా గ్యాస్ సమస్య ఉన్నప్పుడు.. నడవడం లేదా వ్యాయామం చేయాలి. శారీరకంగా చురుకుగా ఉండటం వల్ల మన జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.
Chiranjeevi Charitable Trust: రేపు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహణకు సర్వం సిద్ధం
పీచుతో కూడిన ఆహారం
గర్భధారణ సమయంలో.. మహిళలు ఫైబర్ కలిగి ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. చాలా ఫైబర్ తీసుకోవడం వల్ల కూడా మలబద్ధకానికి కారణమవుతుంది. ఆహారం తీసుకునేటప్పుడు పీచు పదార్థాలు ఉండేలా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
శ్వాస వ్యాయామం
ఒత్తిడి కారణంగా శరీరంలో గ్యాస్ కూడా ఉత్పత్తి అవుతుందని అనేక నివేదికలు వచ్చాయి. గర్భధారణ సమయంలో మానసిక కల్లోలం కాకుండా, ఒత్తిడి కూడా ఉంటుంది. గర్భిణీ స్త్రీలు ఒత్తిడిని తగ్గించుకోవడానికి శ్వాస వ్యాయామాలు చేయాలి. ఈ వ్యాయామం చేయడం వల్ల శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉంటారు.