Bomb Threat: బెంగళూరులోని తాజ్ వెస్ట్ ఎండ్ హోటల్‌కు ఉదయం ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసు బృందం, బాంబు స్క్వాడ్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఉన్న తాజ్ వెస్ట్ ఎండ్ హోటల్‌కు ఈరోజు ఉదయం గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బాంబు బెదిరింపు వచ్చింది. హోటల్‌పై బాంబు పెట్టే ప్లాన్ ఈమెయిల్ ద్వారా అందినట్లు సమాచారం. బెదిరింపుతో కూడిన ఇమెయిల్ గురించి సమాచారం అందుకున్న తరువాత స్థానిక పోలీసులు, బాంబు నిర్వీర్య స్క్వాడ్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం హోటల్ మొత్తం సోదాలు జరుగుతున్నాయి.
Also read: Harsha Sai: హర్షసాయి కోసం రంగంలోకి 4 ఎస్‌వోటీ పోలీసు టీమ్స్
హోటల్ కు బెదిరింపు ఇమెయిల్స్ వచ్చినట్లు బెంగళూరు పోలీస్ డీసీపీ శేఖర్ హెచ్‌టీ ధృవీకరించారు. సమాచారం అందుకున్న వెంటనే హోటల్ భద్రతను పెంచి విచారణ చేపట్టారు. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, సిటీ పోలీస్ టీమ్ హోటల్‌కు చేరుకున్నాయి. ప్రముఖ రాజకీయ నాయకులు, క్రికెటర్లకు ఆతిథ్యం ఇచ్చే హోటల్‌కు ఈ ఉదయం ముప్పు వచ్చింది.
Also read: Harsha Sai: డబ్బు కోసం ఏమైనా చేస్తా.. నిస్సిగ్గుగా హర్ష సాయి కామెంట్స్.. మరో ఆడియో లీక్