Harsha Sai Audio Leaked about Betting Apps Promotion: తెలుగులో పాపులర్ యూట్యూబర్ గా పేరుతెచ్చుకున్న హర్ష సాయి మీద రేప్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఇక ఆ తరువాత నుంచి హర్షసాయి బాధితురాలితో మాట్లాడుతున్న కొన్ని ఆడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఇప్పుడు తెరపైకి హర్ష సాయి మరో సంచలన ఆడియో వచ్చింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ విషయంలో బాధితురాలికి హర్ష సాయికి మధ్య వివాదం తలెత్తినట్టు చెబుతున్నారు. ఆ వివాదానికి సంబంధించి ఆడియో ఇప్పుడు లీక్ అయింది. ఆ ఆడియో కనుక పరిశీలిస్తే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేస్తే హర్ష సాయి ఇమేజ్ దెబ్బ పడుతుంది అని మెగా సినిమాకి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న బాధితురాలు వాపోతోంది. దీంతో ఆ ప్రభావం మెగా సినిమాపై కూడా పడుతుంది అని బాధితురాలు చెబుతూ ఉండగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ ఆపేయాలని బాధితురాలికి హర్ష సాయికి మధ్య వివాదం జరుగుతున్నట్టుగా ఆ ఆడియోలో వినిపిస్తోంది.
Devara Day 1 Collections: డే 1.. దేవర విధ్వంసం!
లోటస్ 360 అనే బెట్టింగ్ యాప్ ను ఈమధ్య సెంట్రల్ గవర్నమెంట్ నిషేధించింది. ఇక ఈ నిషేధించిన బెట్టింగ్ యాప్ లింక్ తన వీడియోలో పెడితే 10 కోట్లయినా ఇస్తారు అని హర్ష సాయి ఆ ఆడియోలో చెబుతున్నాడు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కోసం ఎన్ని కోట్లైనా తీసుకుంటానని హర్ష సాయి నిస్సిగ్గుగా చెబుతున్నట్టు ఆ ఆడియోలో ఉంది. తాను కాకపోతే మరో పదిమందితో వెడ్డింగ్ యాప్స్ నిర్వాహకులు ప్రమోషన్స్ చేయిస్తారు అని అంటూ హర్షసాయి అందులో చెబుతున్నాడు. తాను కచ్చితంగా ప్రమోషన్స్ చేయాలి అని అవి నా మార్కెట్ వేల్యూ పెంచుతాయి అని హర్ష సాయి చెబుతున్నాడు. ఒకరకంగా ఆ కాల్ లో ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ ను సమర్ధించుకుంటున్నాడు హర్ష సాయి. గతంలో కూడా ఇదే అంశం మీద వివాదం చెలరేగగా అప్పుడు కూడా హర్షసాయి తానేం తప్పు చేయడం లేదని, తనను తాను సమర్ధించుకునే ప్రయత్నం చేశాడు.