Ankita Bhandari Case: ప్రస్తుతం ఉద్వాసనకు గురైన బీజేపీ నాయకుడి కుమారుడికి చెందిన రిషికేశ్‌లోని రిసార్ట్‌లో రిసెప్షనిస్ట్‌గా పనిచేసిన 19 ఏళ్ల యువతి అంకితా భండారీ హత్యకేసులో జరిపిన దర్యాప్తుపై స్టేటస్ రిపోర్ట్‌ను దాఖలు చేయాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది. ఈ కేసులో సీబీఐ విచారణ కోరుతూ జర్నలిస్టు, అంకితా భండారీ కుటుంబసభ్యులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్నలతో కూడిన ధర్మాసనం.. స్టేటస్ రిపోర్టును దాఖలు చేయాలని డిప్యూటీ అడ్వకేట్ జనరల్ జతీందర్ కుమార్ సేథీని కోరింది. ఇప్పటివరకు జరిగిన విచారణకు సంబంధించి రిపోర్టును దాఖలు చేయాలని ఆదేశించింది.
బాధితురాలు రిషికేశ్ సమీపంలోని వనంతరా రిసార్ట్‌లో రిసెప్షనిస్ట్‌గా పనిచేసింది. రిసార్ట్‌ను సందర్శించిన వీఐపీకి అదనపు సేవలు అందించమని వారి ఒత్తిడికి లొంగకపోవడంతో దాని యజమాని బీజేపీ నేత వినోద్ ఆర్య కుమారుడు పుల్కిత్ ఆర్య, అతని ఇద్దరు సహచరులు ఆమెను హత్య చేశారు. భండారీ హత్యకు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో వినోద్ ఆర్యను బీజేపీ నుంచి బహిష్కరించారు. ఈ కేసులో ఆర్య సహా ముగ్గురు నిందితులు హత్యానేరం ఎదుర్కొంటున్నారు. విచారణ సందర్భంగా, పిటిషనర్ల తరఫు న్యాయవాది దర్యాప్తు జరిగిన తీరుపై అనేక ప్రశ్నలు లేవనెత్తారు. రాష్ట్ర పోలీసులు చేపట్టిన దర్యాప్తులో అనేక లొసుగులు ఉన్నాయని పేర్కొన్నారు. ముగ్గురు నిందితులపై ఐపీసీలోని 302 (హత్య), 354ఏ (లైంగిక వేధింపులు), అనైతిక ట్రాఫిక్ (నివారణ) చట్టం 5(1) సెక్షన్‌ల కింద అభియోగాలు మోపినప్పటికీ, రాష్ట్ర పోలీసులు కొనసాగిస్తున్న విచారణలో చాలా లోపాలున్నాయని సుప్రీంకోర్టు ధర్మాసనానికి తెలిపారు.
Read Also: Crime News: ఇద్దరు బాలికలపై సామూహిక అత్యాచారం.. ఆరుగురు అరెస్ట్
ఈ కేసును సీబీఐకి అప్పగించాలని మృతురాలి కుటుంబ సభ్యులు గత డిసెంబరులో హైకోర్టును ఆశ్రయించగా ధర్మాసనం తిరస్కరించింది. దీంతో పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర పోలీసులు కొనసాగిస్తున్న విచారణలో చాలా లోపాలున్నాయని వారు సుప్రీంకోర్టు ధర్మాసనానికి తెలిపారు. దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరారు. ఈ నేపథ్యంలోనే ధర్మాసనం ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి పై ఆదేశాలు జారీ చేసింది.
ఉత్తరాఖండ్ హైకోర్టు 2022 డిసెంబర్ 21న సీబీఐ విచారణకు తమ పిటిషన్‌ను కొట్టివేసిన నిర్ణయాన్ని సవాలు చేస్తూ జర్నలిస్టు, మృతుడి తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ కేసును ఇప్పటికే సిట్ దర్యాప్తు చేస్తోందని, అనుమానించాల్సిన అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. పిటిషన్‌లో పేర్కొన్నట్లుగా ఏ వీఐపీకి రక్షణ కల్పించడం లేదని కూడా పేర్కొంది. ఆమె మృతదేహాన్ని వెలికితీసిన రోజే బాధితురాలి గదిని పగలగొట్టారని, మహిళా వైద్యురాలు లేకుండానే పోస్టుమార్టం చేశారని హైకోర్టులో పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రజల ఆగ్రహం పెరగడంతో రాష్ట్ర ప్రభుత్వం రిసార్ట్‌ను కూల్చివేయాలని ఆదేశించింది.