Bengal Assembly Fight: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో గురువారం ఎక్కడ చూడని సన్నివేశం తారసపడింది. వాళ్లందరూ ప్రజాప్రతినిధులు.. కానీ చిన్నపిల్లలు స్కూల్లో దెబ్బలాడుకున్నట్లు ఒకరితో ఒకరు పోట్లాడుకున్నారు. ఈ వీడియోను ఆ రాష్ట్ర బీజేపీ పార్టీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, బెంగాల్లో ప్రజాస్వామ్యం చచ్చిపోయిందని రాసింది. వాస్తవానికి అసెంబ్లీలో ప్రతిపక్ష బీజేపీ, అధికార టీఎంసీ ఎమ్మెల్యేల మధ్య బాహాబాహీ చోటుచేసుకుంది. ఘర్షణ తీవ్ర రూపం దాల్చడంతో మార్షల్స్ ప్రవేశించి.. గొడవను ఆపారు. సభలో జరిగిన గందరగోళం తర్వాత బీజేపీ ఎమ్మెల్యే శంకర్ ఘోష్‌ను సస్పెండ్ చేశారు.
READ ALSO: Putin: భారత్, చైనాలను మీరు బెదిరించలేరు..అమెరికాకు హెచ్చరిక..
అసలేం జరిగిందంటే..
అసెంబ్లీలో సీఎం మమతా బెనర్జీ బీజేపీని, ప్రధానమంత్రి మోడీ, హోంమంత్రి అమిత్ షాలను లక్షంగా చేసుకొని విమర్శలు గుప్పించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీజేపీ బంగ్లా – బరోడీ, బెంగాల్ వ్యతిరేకమని అన్నారు. బెంగాల్ ప్రజల అణచివేతపై బీజేపీ వాళ్లు సభలో చర్చ జరగాలని కూడా కోరుకోవడం లేదని చెప్పారు. అందుకే వాళ్లు అసెంబ్లీలో గందరగోళం సృష్టిస్తున్నారని అన్నారు. బీజేపీ వాళ్లను అవినీతిపరులని, వాళ్లది ఓటు దొంగల పార్టీ అని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. బీజేపీ, టీఎంసీ ఎంపీలను వేధించడానికి సీఐఎస్ఎఫ్ను ఎలా ఉపయోగించుకుందో పార్లమెంటులో చూశామని తన ప్రసంగంలో చెప్పారు. బెంగాల్ అసెంబ్లీలో ఒక్క బీజేపీ ఎమ్మెల్యే కూడా కూర్చోని రోజు కచ్చితంగా వస్తుందని సీఎం చెప్పారు. కేంద్రంలో మోడీ, అమిత్ షా నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం త్వరలో కూలిపోతుందని, కొన్ని రోజుల తర్వాత ప్రజలు బీజేపీని అధికారం నుంచి తరిమికొడతారని సీఎం అన్నారు.
ప్రజాస్వామ్యాన్ని హత్య చేశారంటూ పోస్ట్..
అసెంబ్లీలో జరిగిన గందరగోళ వీడియోను బీజేపీ నాయకుడు సువేంధు అధికారి తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆమె నాయకులు గురువారం అసెంబ్లీ సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని హత్య చేశారని ఆయన తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. పశ్చిమ బెంగాల్ బీజేపీ పార్టీ తన సోషల్ మీడియాలో ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేసి, బెంగాల్లో ప్రజాస్వామ్యం చచ్చిపోయిందని రాసింది. బెంగాల్ సీఎం అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై దాడి చేస్తున్నారని విమర్శించారు. ఒకప్పుడు సీపీఎం చేసిన తప్పునే నేడు టీఎంసీ చేస్తుందని, ఇక టీఎంసీ పని అయిపోయిందని పేర్కొంది. టీఎంసీ వాళ్లు పోరాడాలనుకుంటే భద్రత లేకుండా వీధుల్లోకి రావాలని సవాల్ విసిరారు.
READ ALSO: Shocking Incident: వీడు మామూలోడు కాదు భయ్యా.. ఏకంగా జడ్జినే బెదిరించాడు..
আজ পশ্চিমবঙ্গ বিধানসভায় গনতন্ত্র কে হত্যা করলো গনতন্ত্র হত্যাকারী মমতা ও তার দলদাস প্রশাসন… pic.twitter.com/X7XGw2WK2s
— Suvendu Adhikari (@SuvenduWB) September 4, 2025