Beggar: యాచకుడి జేబులో రూ.5 లక్షలు.. మ్యాటరేంటంటే.?
- ఓ బిచ్చగాడి జేబులో రూ.5 లక్షలకు పైగా నగదు దొరికిన షాకింగ్ ఘటన.
- పాకిస్థాన్ లో వెలుగులోకి.
- రెస్క్యూ టీమ్ అతడి నుంచి రూ.5 లక్షల 34 వేలు స్వాధీనం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Beggar Having Huge amount of money : ఓ బిచ్చగాడి జేబులో రూ.5 లక్షలకు పైగా నగదు దొరికిన షాకింగ్ ఘటన పాకిస్థాన్ లో వెలుగులోకి వచ్చింది. ఓ వృద్ధ బిచ్చగాడు అపస్మారక స్థితిలో రోడ్డుపై పడి ఉండగా.. అతడిని రక్షించే సమయంలో ఆసుపత్రికి తీసుకువెళుతుండగా.. అతని జేబులో భారీగా డబ్బు కనిపించింది. పాకిస్థాన్ మీడియా నివేదిక ప్రకారం.., పంజాబ్ ప్రావిన్స్ లోని సర్గోధా జిల్లాలోని ఖుషబ్ రోడ్‌లో బిచ్చగాడు అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. వృద్ధుడిని ఆస్పత్రికి తరలించిన రెస్క్యూ టీమ్ అతడి నుంచి రూ.5 లక్షల 34 వేలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. బిచ్చగాడి నుంచి పలుమార్లు సౌదీ అరేబియా వెళ్లినట్లు తెలిపే పాస్ పోర్టు కూడా లభించింది. వృద్ధుడు సౌదీ అరేబియా వెళ్లి భిక్షాటన చేసేవాడని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Ambati Rambabu: ఏపీకి ఇచ్చిన రూ. 15 వేల కోట్లు గ్రాంట్ కాదు అప్పు..?
Also Read
- Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
- EPFO WhatsApp Service: PF క్లెయిమ్ స్టేటస్ నుంచి బ్యాలెన్స్ వరకు.. అన్నీ వాట్సాప్‌లోనే..
- West Bengal: మదర్సాలపై బెంగాల్ ప్రభుత్వం ఉక్కుపాదం.. 252 మూసివేత.. 100 సంస్థలకు షోకాజ్ నోటీసులు
- Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
స్థానిక అధికారి మాట్లాడుతూ.., ఒక తెలియని కాల్ వచ్చిందని దాని తర్వాత వృద్ధుడికి సహాయం చేయడానికి ఓ రెస్క్యూ టీమ్ కు చేరుకుందని., ఆ వ్యక్తి అదే ప్రాంతంలో భిక్షాటన చేస్తాడని అక్కడి ప్రజలు ఆ బృందానికి తెలిపారు. వృద్ధుడిని ఆసుపత్రికి తరలించామని అతను కోలుకున్నాక ఇంటికి వెళ్లే మార్గంలో అతని డబ్బు, వస్తువులన్నీ తిరిగి ఇచ్చామని రెస్క్యూ అధికారులు తెలిపారు. గతేడాది సెప్టెంబర్‌లో పాకిస్థాన్ పౌరులు ఉమ్రా వీసాపై సౌదీ అరేబియాకు వెళ్లి భిక్షాటన చేస్తున్నట్టు అనేక వార్తలు వచ్చాయి. మానవ అక్రమ రవాణా మార్గాల ద్వారా పెద్ద సంఖ్యలో యాచకులు విదేశాలకు వెళ్తున్నారని ఓవర్సీస్ పాకిస్థానీలు, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సెనేట్ కమిటీకి తెలిపింది.
Rafale Jets: రాకెట్ దూసుకెళ్తుండగా తోడుగా వెళ్లిన రఫేల్ యుద్ధ విమానాలు.. వీడియో వైరల్
విదేశాల్లో అరెస్టయిన యాచకుల్లో 90% మంది పాకిస్థానీలేనని సెనేట్ కమిటీకి మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ విషయం మంత్రిత్వ శాఖ కార్యదర్శి మాట్లాడుతూ.. ‘ఇరాక్, సౌదీ అరేబియా రాయబారులు ఇటువంటి అరెస్టులు తమ జైళ్లలో కిక్కిరిసిపోయేలా చేశాయని చెప్పారు. సౌదీ అరేబియాలోని మస్జిద్ అల్ హరామ్ వెలుపల పట్టుబడిన పిక్ పాకెట్లలో ఎక్కువ మంది పాకిస్థానీ మూలానికి చెందినవారని., ఈ వ్యక్తులు భిక్షాటన చేయడానికి ఉమ్రా వీసాపై సౌదీకి చేరుకుంటారని వారు తెలిపారు.
తాజావార్తలు
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
Taapsee Pannu: తాప్సీ చేసిన ఈ ఫన్నీ ఫీట్ చూస్తే నవ్వాపుకోలేరు.. చివరికి AIనే నమ్ముకోవాల్సి వచ్చిందంట!
-
EPFO WhatsApp Service: PF క్లెయిమ్ స్టేటస్ నుంచి బ్యాలెన్స్ వరకు.. అన్నీ వాట్సాప్‌లోనే..
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
West Bengal: మదర్సాలపై బెంగాల్ ప్రభుత్వం ఉక్కుపాదం.. 252 మూసివేత.. 100 సంస్థలకు షోకాజ్ నోటీసులు
ట్రెండింగ్
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!