ఆరోగ్యంగా ఉండాలంటే రన్నింగ్ చేయడం ముఖ్యం. కాని చేసేటప్పుడు కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. కొందరు రన్నింగ్ చేసేటప్పుడు తరచూ కొన్ని తప్పులు చేస్తుంటారు. వాటిని వీలైనంత వరకు తగ్గించు కోవాలి. లేదంటే ఎంత రన్నింగ్ చేసినా ఫలితం ఉండదు. ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం రన్నింగ్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎక్కువగా వేగంగా కాకుండా తక్కువ వేగంతో పరుగెత్తాలి. ఇది సులభంగా చేయవచ్చు. ఫిట్‌గా ఉండటానికి ప్రయత్నిస్తున్న చాలా మందికి ఇది ఒక ప్రసిద్ధ వ్యాయామం. ఈ వ్యాయామం తప్పుగా చేయడం వలన చీలమండ బెణుకులు, పగుళ్లు, మోకాలికి గాయాలకు దారితీయవచ్చు. ఇది కండరాల అసమతుల్యత, వెన్నునొప్పికి కూడా కారణమవుతుంది. చాలా మంది రన్నర్లు అనుకోకుండా కీళ్ల నొప్పులు వచ్చే ప్రమాదాన్ని పెంచే పనులు చేస్తారు.
READ MORE: Whats up: వాట్సప్ లో కొత్త ఫీచర్.. ఇక నుంచి అలా చేస్తే అకౌంట్ బ్లాక్
మొదట తక్కువ దూరంతో ప్రారంభించి క్రమంగా దూరాన్ని పెంచాలి. ఒకే సారి ఎక్కువ దూరం పరిగెత్తి ఒత్తిడిని పెంచవద్దు. ఇలా చేస్తే ఓవర్ స్ట్రైడింగ్ ముఖ్యంగా మోకాళ్లలో, మీ కీళ్లపై ప్రభావం ఒత్తిడిని పెంచుతుంది. కాలక్రమేణా ఒత్తిడి ఆర్థరైటిస్, కీళ్ల క్షీణతకు కారణం అవుతుంది. పరుగు సమయంలో లేదా తర్వాత మీకు అసౌకర్యం అనిపిస్తే లక్షణాలపై దృష్టి పెట్టండి. వైద్య సలహా తీసుకోండి. రన్నింగ్ కు ముందు డైనమిక్ స్ట్రెచ్‌లు, మొబిలిటీ వ్యాయామాలు తప్పకుండా చేయాలి. ఈవ్యాయామం చేయడం వల్ల కండరాలు, కీళ్లను సిద్ధం చేస్తాయి. సరైన వార్మప్, కూల్-డౌన్ వ్యాయామాలు చేయడంలో విఫలమవడం వల్ల కీళ్ల గాయాలయ్యే అవకాశాలు పెరుగుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. కాళ్లను ఎక్కువగా వంచడం, ఎక్కువగా వంగడం, మడమలను గట్టిగా నొక్కడం వంటి సాధారణ తప్పులు నివారించాలి.
ఫిజియోథెరపిస్ట్ లేదా ట్రైనర్‌ని సంప్రదించడం వల్ల మీ రన్నింగ్ ట్రైనింగ్‌ను మెరుగుపరచడంలో, మీ కీళ్లపై ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. సరిపోని బూట్లను ధరించడం కూడా మీ రన్నింగ్‌ను ప్రభావితం చేస్తుంది. ఒత్తిడిని తీవ్రతరం చేస్తాయి. వారానికి ఒకసారి టెంపో పరుగును చేర్చాలి. అంటే నిర్ణిత సమయం పెట్టుకుని పరుగెత్తాలి. ఇలా చేస్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. లేదంటే రన్నింగ్ వల్ల వచ్చే లాభాల కన్నా.. నష్టాల శాతం పెరిగే అవకాశం ఉంది.