Beerla Ilaiah : ప్రజా ప్రభుత్వం పైన కేటీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నాడని ప్రభుత్వ విప్ బీర అయిలయ్య విమర్శలు గుప్పిస్తున్నారు. అధికారం పోయిందన్న అక్కసుతో ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాడని, కేటీఆర్ వెకిలి చేష్టలతో కాళ్లలో కట్టెలు పెట్టినట్లు మాట్లాడుతున్నాడని బీర్ల ఐలయ్య వ్యాఖ్యానించారు. కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకో..లేకుంటే నాలుక కోస్తామని, అవినీతి డబ్బుతో పెట్టిన పింకీ మీడియా తో ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చేస్తున్నాడని, ప్రజా ప్రభుత్వాన్ని కూల్చుతామని సిగ్గుమాలిన మాటలు మాట్లాడుతున్నాడని, రియల్టర్లు, బ్రోకర్లు, భూ స్కాం లు చేసిన వారు చందాలు ఇస్తున్నరని సిగ్గుమాలిన మాటలు మాట్లాడుతున్నాడన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనమని చందాలు ఇస్తున్నారని మాట్లాడుతున్నాడని, మీ లాగా సంతలో పశువుల్లా మా ఎమ్మెల్యేలు అమ్ముడుపోడు.. ప్రజలు ఎన్నుకున్న నిఖార్సైన ఎమ్మెల్యేలు అని ఆయన వ్యాఖ్యానించారు. మా ఎమ్మెల్యేలు ఎవరూ అమ్ముడు పోవడానికి సిద్ధంగా లేరని, నీ నాయకత్వం నచ్చకనే పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మా పార్టీకి వచ్చారన్నారు.
ధరణితో భూములను కొల్లగొట్టి ఆ డబ్బుతో ఎమ్మెల్యేలను కొనాలని కేటీఆర్ చూస్తున్నాడి ఆయన మండిపడ్డారు. కేటీఆర్..నీ అయ్య జేజమ్మ దిగివచ్చినా పదేళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుంది…రాసి పెట్టుకో అని, అసెంబ్లీ ఎన్నికల్లో బొందపెట్టారు.. పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్నా ఇచ్చిన సిగ్గు రాలేదన్నారు బీర్ల ఐలయ్య. చిల్లర మల్లర రాజకీయాల్లో చేస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామాల్లో తిరగనివ్వరని, పేదలకు సన్నబియ్యం ఇస్తు పేదోడి బువ్వ పెడుతుంటే ఓర్వలేక ప్రభుత్వాన్ని పడగొడతామని నీచాతి నీచంగా మాట్లాడుతున్నారన్నారు. ప్రభుత్వం గురించి, ముఖ్యమంత్రి గురించి మరోసారి మాట్లాడితే గ్రామాల్లో ప్రజలు రాళ్లతో కొడతారు..జాగ్రత్త అని బీర్ల ఐలయ్య వ్యాఖ్యానించారు.
