కాంగ్రెస్ పాలన చూసి బీజేపీ, బీఅర్ఎస్ లు ఓర్వలేక పోతున్నాయని విమర్శించారు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీసీలు తల దించుకునేలా ఈటల రాజేందర్ మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. మల్కాజిగిరిలో ఈటల గెలవడానికి బీజేపీ బీఅర్ఎస్ తో చీకటి ఒప్పందం చేసుకుందని, రేవంత్ రెడ్డి పై ఈటల రాజేందర్ చేసిన వాఖ్యలు వెనక్కి తీసుకోవాలన్నారు. ఈటల గెలవడానికి మల్కాజ్గిరిలో బీఅర్ఎస్ డమ్మీ అభ్యర్థిని నిలబెట్టిందని ఆయన వ్యాఖ్యానించారు. ఈటల గెలుపు కోసం కేసీఆర్ తురుము ఖాన్ అంటూ పొగుడుతున్నారని, ఫోన్ ట్యాపింగ్ చేసింది బీజేపీ, బీఅర్ఎస్ లు కాదా అని ఆయన ప్రశ్నించారు.
అంతేకాకుండా..’ఫోన్ ట్యాపింగ్ లకు కాంగ్రెస్ వ్యతిరేకం.. ఫోన్ ట్యాపింగ్ ల సంస్కృతి బీజేపీ, బీఅర్ఎస్ పార్టీలది.. మా పార్టీ సంస్కృతి కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలనను బీజేపీ, బీఅర్ఎస్ లుజీర్ణించుకోలేకపోతున్నాయి.. మల్కాజిగిరి లో బీజేపీ, బీఅర్ఎస్ లు చీకటి ఒప్పందం కుదుర్చుకున్నాయి.. బీజేపీ, బీఅర్ఎస్ లు చౌక బారు రాజకీయాలు మానుకోవాలి రాష్ట్రంలో బీజేపీ, బీఅర్ఎస్ లకు డిపాజిట్లు కూడా రావు.. మత చిచ్చు పెట్టి ఓట్లు దందుకోవాలని బీజేపీ చూస్తోంది.. బీజేపీ, బీఅర్ఎస్ ల చీకటి ఒప్పందాలు ప్రజలు చూస్తున్నారు.. రేవంత్ రెడ్డిపై చిల్లర మల్లర వాఖ్యలు చేస్తున్నారు.. గతంలో గడీల పాలన ఉంటే నేడు ప్రజా పాలన కొనసాగుతోంది. ప్రజా పాలన చూసి మిగితా పార్టీ వాళ్ళు కాంగ్రెస్ లోకి వస్తున్నారు.. ఎంపీ ఎలక్షన్ తరువాత బీజేపీ, బీఅర్ ఎస్ ఖాళీ… సర్వేల ఆధారంగానే అధిష్టానం టికెట్ల కేటాయింపు చేస్తుంది.. దేశంలో ఏ ముఖ్యమంత్రి అయిన ప్రత్యేక చాపర్ కొన్నారా..? వంద కోట్లతో కెసిఆర్ చాపర్ ఎట్లా కొన్నారు..? కార్పొరేషన్ పదవులలో బీసీలకు ఎలాంటి అన్యాయం జరగలేదు.. అన్ని సామాజిక వర్గాల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది..’ అని బీర్ల ఐలయ్య అన్నారు.