NTV Telugu Site icon

MP Prasada Rao: రాష్టానికి ఏమీ అడిగినా కేంద్రం సహకరిస్తుంది..

All Party Meeting

All Party Meeting

ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే పలు బిల్లులు, ప్రభుత్వ అజెండాపై అఖిలపక్ష నేతలకు కేంద్రం వివరించింది. పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని, కీలక బిల్లుల ఆమోదానికి మద్దతు తెలపాలని అఖిలపక్ష నేతలను ప్రభుత్వం కోరింది. అఖిలపక్ష సమావేశానికి టీడీపీ తరపున బీద మస్తాన్ రావు, వైసీపీ తరపున మిథున్ రెడ్డి, జనసేన తరపున బాలశౌరి హాజరయ్యారు. అటు.. కాంగ్రెస్ తరపున జైరాం రమేష్, గౌరవ్ గొగోయ్ హాజరయ్యారు. అనివార్య కారణాలతో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే.ఆర్ సురేష్ రెడ్డి గైర్హాజరయ్యారు.

Read Also: Chandigarh: ఆప్-కాంగ్రెస్ కూటమికి బిగ్ షాక్.. చండీగఢ్ మేయర్ బీజేపీ కైవసం

సమావేశం అనంతరం టీడీపీ రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్ రావు మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన హామీలు ఇంకా పూర్తిగా అమలు కాలేదని అన్నారు. రాష్ట్ర విభజనలో పోలవరం నిర్మాణం, రాజధానికి నిధులు, ప్రత్యేక హోదా ఇతర సహాయం అందించాలని కేంద్రాన్ని కోరామని తెలిపారు. రాష్ట్ర అంశాలపై చర్చించేందుకు లోక్ సభలో సమయం ఇవ్వాలని కోరాం.. ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా రాష్ట్ర రావాల్సిన నిధులను సాధిస్తామని చెప్పారు. రాష్ట్రం నుంచి ఉన్న ఎంపీలు సైతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సహకరించాలని బీద మస్తాన్ రావు పేర్కొన్నారు.

Read Also: India AI: మనకు సొంత ఏఐ.. కేంద్రమంత్రి కీలక ప్రకటన..

టీడీపీ లోక్ సభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఎంపీ ప్రసాదరావు మాట్లాడుతూ.. అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యామని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం.. రాష్టానికి ఏమీ అడిగినా కేంద్రం సహకరిస్తుందని తెలిపారు. అన్ని పార్టీలు అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యాయి.. లోక్‌సభ, రాజ్యసభలో టీడీపీకి సీటింగ్ ఒకే దగ్గరే ఇవ్వమని కోరామన్నారు. సీనియర్ ఎంపీలకు ప్రాధాన్యత కల్పించాలని కోరాం.. పార్లమెంట్‌లో చర్చించే సమయంలో ప్రాధాన్యత ఇవ్వాలని కోరామని చెప్పారు. రాష్టానికి సంబంధించిన పెండింగ్ అంశాలను పూర్తి చేయాలని కోరాం.. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరామని ప్రసాదరావు తెలిపారు.

Read Also: Ola Electric: ఓలా నుంచి నెక్స్ట్‌ జనరేషన్‌ స్కూటర్‌.. రేపే విడుదల..

వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి మాట్లాడుతూ.. పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో పార్లమెంటులో చర్చ జరగాలని.. మంత్రి సమాధానం ఇవ్వాలని కోరానని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న రాష్ట్ర విభజన అంశాలపై చర్చ జరగాలని కోరానని అన్నారు. అలాగే.. పెరిగిపోతున్న డ్రగ్స్ వాడకం వల్ల యువత నిర్వీర్యమైపోతోంది.. జరిగే అనర్థాలపై సావధాన తీర్మానం కింద చర్చ జరగాలని కోరానని పేర్కొన్నారు. మార్గదర్శి చిట్స్.. సహారా కుంభకోణం కంటే పెద్దది. సభలో సావధాన తీర్మానం కింద చర్చ జరగాలని కోరినట్లు మిధున్ రెడ్డి చెప్పారు. మార్గదర్శి డిపాజిటర్లు నష్టపోకుండా రక్షణ కల్పించాలన్నారు. సుప్రీంకోర్టులో రిజర్వ్ బ్యాంకు మార్గదర్శి అక్రమాలపై అఫిడవిట్ కూడా దాఖలు చేసింది.. మార్గదర్శి అక్రమాలపై పూర్తి స్థాయి చర్చ జరగాలని కోరానని మిధున్ రెడ్డి తెలిపారు.