లిక్కర్ స్కాం కేసులో ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో ఏ4గా ఉన్నారు. గతంలో ఒకసారి సిట్ విచారణకు హాజరయ్యారు. తాజాగా మరోసారి సిట్ విచారణకు హాజరు కాగా.. ఆయన్ని అరెస్ట్ చేశారు. రేపు కోర్టులో మిథున్ రెడ్డిని సిట్ హాజరుపర్చనుంది.
ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే పలు బిల్లులు, ప్రభుత్వ అజెండాపై అఖిలపక్ష నేతలకు కేంద్రం వివరించింది. పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని, కీలక బిల్లుల ఆమోదానికి మద్దతు తెలపాలని అఖిలపక్ష నేతలను ప్రభుత్వం కోరింది. అఖిలపక్ష సమావేశానికి టీడీపీ తరపున బీద మస్తాన్ రావు, వైసీపీ తరపున మిథున్ రెడ్డి, జనసేన తరపున బాలశౌరి హాజరయ్యారు.