BCCI Plans To Hike Test Match Fee: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. టెస్ట్ మ్యాచ్‌లు ఆడే ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజు పెంచాలని బీసీసీఐ భావిస్తోందట. రెడ్ బాల్ క్రికెట్‌పై ఆటగాళ్లకు ఆసక్తి పెంచేందుకు బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కోసం రంజీల్లో ఆడాలన్న బోర్డు ఆదేశాలను టీమిండియా యువ ప్లేయర్స్ ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్‌లు ధిక్కరించిన సంగతి తెలిసిందే. వారి వ్యవహరంపై బీసీసీఐ పెద్దలు సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది.
‘ఏ ఆటగాడైనా క్యాలెండర్ ఈయర్‌లోని అన్ని టెస్ట్ సిరీస్‌లను ఆడితే.. అతనికి వార్షిక రిటైన్ కాంట్రాక్ట్‌తో పాటు అదనంగా రివార్డ్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. మ్యాచ్ ఫీజులు కూడే పెరిగే అవకాశం ఉంది. టెస్ట్ క్రికెట్ ఆడేందుకు ఇది అదనపు ప్రోత్సాహకం అవుతుంది. ఈ నిర్ణయంతో టెస్ట్ క్రికెట్ ఆడేందుకు ఆటగాళ్లు ఆసక్తి చూపుతారని భావిస్తున్నాము’ అని బీసీసీఐ అధికారి ఒకరు ఓ జాతీయ మీడియాతో తెలిపారు. కొత్త రెమ్యునరేషన్ మోడల్ ఐపీఎల్ 2024 అనంతరం అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.
Also Read: Virat Kohli: రెస్టారంట్‌లో కూతురు వామికతో విరాట్ కోహ్లీ.. ఫొటో వైరల్!
కొత్త రెమ్యునరేషన్ మోడల్ ఆమోదం పొందినట్లయితే.. ఒక్కో టెస్టు మ్యాచ్‌కు రూ.20 లక్షల ఫీజు బీసీసీఐ చెల్లిస్తుందని తెలుస్తోంది. బీసీసీఐ ప్రస్తుతం ఒక్కో టెస్టుకు మ్యాచ్ ఫీజుగా రూ.15 లక్షలు చెల్లిస్తోంది. అంటే అదనంగా రూ.5 లక్షల ఫీజు పెరగనుంది. ఇక ఒక్కో వన్డేకు 6 లక్షలు, ఒక టీ20 మ్యాచ్‌కు 3 లక్షలు ఆటగాళ్లకు బీసీసీఐ ఇస్తుంది.