Virat Kohli takes daughter Vamika to lunch in London: భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మలు రెండోసారి తల్లిదండ్రులైన విషయం తెలిసిందే. 2024 ఫిబ్రవరి 15న లండన్‌లోని ఓ ఆసుపత్రిలో అనుష్క పండంటి మగబిడ్డకు జన్మినిచ్చారు. ఈ విషయాన్ని విరాట్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. తమ కుమారుడికి అకాయ్ అని నామకరణం చేసినట్లు కూడా తెలిపాడు. ప్రస్తుతం కోహ్లీ తన కుటుంబంతో కలిసి లండన్‌లో ఉన్నాడు.
ప్రస్తుతం అనుష్క శర్మ తన కుమారుడు ఆకాయ్‌తో సమయం గడుపుతున్నారు. ఆకాయ్‌తో అనుష్క బిజీగా ఉండడంతో.. విరాట్ కోహ్లీ తన గారాలపట్టి వామికను లండన్‌లోని ఓ రెస్టారంట్‌కు లంచ్‌కి తీసుకెళ్లాడు. రెస్టారంట్‌లో ఇద్దరు లంచ్ చేశారు. కోహ్లీ, వామిక ఇద్దరూ నలుపు మరియు తెలుపు దుస్తులు ధరించారు. ఇందుకు సంబంధించిన ఫొటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎప్పటిలానే వామిక ముఖం మాత్రం కనిపించలేదు. తమ పిల్లల విషయంలో గోప్యత పాటించాలని గతంలోనే విరాట్ వెల్లడించిన విషయం తెలిసిందే. అందులకే వెనకాల నుంచి ఫోటో తీసిన వ్యక్తి వామిక ముఖం కనిపించకుండా జాగ్రత్తపడ్డాడు.
Also Read: Uday Kiran: ఉదయ్ కిరణ్ హిట్ సినిమాలు రీ-రిలీజ్!
వ్యక్తిగత కారణాలతో ఇంగ్లండ్ సిరీస్ మొత్తానికి విరాట్ కోహ్లీ దూరమైన విషయం తెలిసిందే. మొదటి రెండు టెస్టులకు జట్టుకు ఎంపికైన విరాట్.. తొలి టెస్ట్ కోసం హైదరాబాద్ కూడా వచ్చాడు. అయితే వెంటనే ఇంటికి వెళ్ళిపోయాడు. మూడో టెస్ట్ నుంచి జట్టుకు అందుబాటులో ఉంటాడనుకున్నా.. అది జరగలేదు. ప్రస్తుతం కుటుంబంతో కలిసి లండన్‌లో ఉన్నాడు. త్వరలో జరగబోయే ఐపీఎల్ 2024లో ఆడతాడా? లేదా? అన్నదానిపైనా కూడా సందిగ్ధత నెలకొంది.