IPL 2025: నేడు భారతదేశం, ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్ ప్రారంభమైంది. మరో రెండు రోజులలో IPL 2025 సీజన్ సంబంధిత మెగా వేలం సౌదీ అరేబియాలోని జెడ్డాలో నిర్వహించబడుతుంది. రెండు రోజుల పాటు జరిగే ఈ వేలం కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వేలం ప్రారంభం కాకముందే ఐపీఎల్ తదుపరి సీజన్ తేదీని వెల్లడించారు. ఐపీఎల్ 2025 సీజన్ ఎప్పుడు మొదలవుతుంది, ఎంతకాలం కొనసాగుతుంది అనేది వెల్లడైంది. IPL 2025 సీజన్ మునుపటి సీజన్‌ల కంటే చాలా త్వరగా ప్రారంభమవుతుంది. ఒక నివేదిక ప్రకారం, తదుపరి సీజన్ మార్చి 14, 2025 నుండి ప్రారంభమవుతుంది. ఈ టోర్నమెంట్ మే 25 వరకు కొనసాగుతుంది. అంటే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ముగిసిన వెంటనే టోర్నీ ప్రారంభం కానుంది. మార్చి 9న ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
Also Read: Ram Gopal Varma: ఆర్జీవీ ముందస్తు బెయిల్ పిటిషన్లు.. నేడు హైకోర్టులో విచారణ
ప్రముఖ క్రీడా వేదిక నివేదిక ప్రకారం.. బీసీసీఐ అన్ని IPL ఫ్రాంచైజీలకు ఇమెయిల్ పంపిందని, దీనిలో ఐపీఎల్ 2025 సీజన్ తేదీ వెల్లడి చేయబడిందని తెలిపింది. తదుపరి సీజన్ మాత్రమే కాదు, ఆ తర్వాత 2026, 2027 మరో రెండు సీజన్ల తేదీలు కూడా వెల్లడయ్యాయి. బోర్డు వారిని టోర్నమెంట్ విండోగా మాత్రమే పిలిచిందని నివేదికలో చెప్పినప్పటికీ, అదే తేదీలలో టోర్నమెంట్ నిర్వహించబడుతుందని అర్థమవుతుంది. 2026 సీజన్ మార్చి 15 నుండి ప్రారంభమై మే 31 వరకు కొనసాగుతుంది. 2027 సీజన్ కూడా మార్చి 14 నుండి ప్రారంభమై మే 30 వరకు కొనసాగుతుంది.
Also Read: USA-Russia: అమెరికాపై రష్యా దాడులు చేసే ఛాన్స్.. యూఎస్ ఇంటెలిజెన్స్ అలర్ట్!