Kondagattu: యాదాద్రి తరహాలో కొండగట్టు నిర్మాణం చేపడుతామని ఆర్కిటెక్చర్ ఆనంద్ సాయి స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కొండగట్టుకు రావడం జరిగిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. సీఎం కేసిఆర్ అవసరమున్న పనులను గుర్తించి నివేదించాలని సూచించారు. కొండగట్టు ను యాదాద్రి తరహాలో అభివృద్ధి చేసేందుకే సీఎం కేసీఆర్ రూ.100 కోట్లు కేటాయించారని ఆనంద్ సాయి అన్నారు. రూ.100 కోట్లతో కొండగట్టు అభివృద్ధి చెందడమే కాకుండా రూపురేఖలు కూడా మారనున్నాయన్నారు. ఆలయ విగ్రహం, ఆలయం, గోపురాలు, పార్కింగ్, పుష్కరిణి, త్రాగునీరు, స్నానాల గదులు, పరిసరాల పచ్చదనం – పరిశుభ్రత, రోడ్లు ఇత్యాది పనులు పక్కా మాస్టర్ ప్లాన్ తో చేయడం జరుగుతుందని అన్నారు.
Read Also: CM KCR: ఎప్పుడో చనిపోయిన నెహ్రూ, ఇందిరాగాంధీ పేర్లతో రాజకీయమేంది?
భక్తులకు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసేలా అర్చకులతో కలిసి మాస్టర్ ప్లాన్ పైన చర్చించామన్నారు. 3,4 రోజుల్లో సీఎం కేసీఆర్ కొండగట్టుకు రానున్నారన్న ఆనంద్ సాయి.. 108 అడుగుల ఎత్తైన ఆంజనేయ స్వామి విగ్రహం ఏర్పాటు చేసే ఆలోచనలో సీఎం కేసీఆర్ ఉన్నారని తెలిపారు. అన్ని వైపుల నుండి అంజన్న విగ్రహం కనిపించేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు. కలెక్టర్ యాస్మిన్ భాషా, ఎస్పీ భాస్కర్, ఇతర ఉన్నతాధికారులతో ఆయన ప్రత్యేకంగా చర్చించారు. వారితో కలిసి ఆలయ పరిసరాలు, కొండలు తిరిగి పరిశీలించారు.
Read Also: Bandi Sanjay: అధికారంలోకి వస్తే కొత్త సచివాలయ డోమ్లు కూల్చేస్తాం