Dharmapuri Arvind : బీజేపీ ఎంపీ అరవింద్ ధర్మపురి ఇటీవల తెలంగాణ రాజకీయాలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి బీసీ రాజకీయాలను ఉపయోగించి దద్దమ్మ పాలనను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఆయన మాట్లాడుతూ, ఎన్నికల ముందు ఒక విధంగా మాటలు చెప్పి, తర్వాత మరో విధంగా ప్రవర్తించడం రేవంత్ రెడ్డికి కొత్త విషయమేమీ కాదు అని పేర్కొన్నారు. అరవింద్ ధర్మపురి ప్రశ్నించారు, కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్‌ను లోపల ఎందుకు ఉంచలేదు, కేటీఆర్‌ను లోపల…
KA Paul: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ. పాల్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బీసీల రిజర్వేషన్ల అంశంలో కాంగ్రెస్ పార్టీ నాటకాలు ఆడుతోందని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా.. “బీసీల రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టు, హైకోర్టులో పిటిషన్లు వేసి డ్రామాలు చేస్తోంది. ఆర్. కృష్ణయ్యతో సహా కొంతమంది బీసీ నేతలు కూడా డ్రామాలు ఆపాలని ఆయన అన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు చిత్తశుద్ధి చూపలేకపోయింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ఎన్నిసార్లు అధికారంలోకి…
మంత్రి సత్య ప్రసాద్ మాట్లాడుతూ.. బీసీలు అంటే బలం, చైతన్యం కలిగి ఉన్నారు.. బీసీలు అంటే ముందుండి నడిపించే వాళ్ళని నిరూపించిన ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీసీలకు పూర్వవైభవం వచ్చిందన్నారు. గత పాలకులు బీసీల ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీసేలా వ్యవహరించారు అని ఆరోపించారు.
V. Srinivas Goud: తెలంగాణ ప్రభుత్వం నిన్న ప్రకటించిన నివేదిక తప్పుల తడకగా ఉందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలను మోసం చేస్తుంది అని ఆరోపించారు. కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేశారు.. ఎన్నికల కోసం తప్పుడు నివేదికలను ప్రకటించారు..
బీసీలను పార్లమెంట్ మెట్లు ఎక్కించిన ఘనత టీడీపీది.. బీసీలకు నూతన పథకాలు ప్రారంభమయ్యాయంటే.. అది టీడీపీ ప్రభుత్వంలోనే.. బీసీలకు రిజర్వేషన్లు పెట్టిన ఘనత చంద్రబాబుది.. దావోస్, అమెరికాలాంటి దేశాల్లో కూడా బీసీలు ఉద్యోగాలు చేసే స్థాయికి ఎదిగారంటే చంద్రబాబు చేసిన కృషి కారణం అని రామ్మోహన్ నాయుడు చెప్పుకొచ్చారు.