Mohanlal : మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ తాజాగా టాలీవుడ్ మీద ప్రశంసలు కురిపించారు. పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో ఆయన నటించిన తాజా మూవీ ఎల్-2.. ఎంపురాన్. ఈ సినిమా మార్చి 27న రిలీజ్ కాబోతోంది. దీంతో మూవీ టీమ్ భారీగా ప్రమోషన్లు చేస్తోంది. గతంలో మోహన్ లాల్ ఏ సినిమాకు చేయనంతగా తెలుగులో ప్రమోషన్లు చేస్తున్నారు. తాజాగా మూవీ టీమ్ టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజుతో కలిసి ఓ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో మోహన్ లాల్ మాట్లాడుతూ టాలీవుడ్ మీద తనకున్న ప్రేమను కురిపించారు.
Read Also : Charan : స్టార్ దర్శకడు లోకేశ్ తో రామ్ చరణ్ మూవీ ..!
‘నాకు తెలిసి తెలుగు సినీ పరిశ్రమ దేశంలోనే బెస్ట్ ఇండస్ట్రీ. ఇక్కడ అభిమానులు చూపించే ప్రేమను మాటల్లో చెప్పలేం. నటులకు వారిచ్చే గౌరవం ఎంతో గొప్పది. నేను టాలీవుడ్ లో ఎంతో మందితో కలిసి పనిచేశాను. అక్కినేని నాగేశ్వర్ రావుతో కలిసి పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎల్-2 మీ అందరికీ నచ్చుతుంది. మూడో పార్టు కూడా ప్లాన్ చేస్తున్నాం. ఈ సినిమాను ఆదరించాలని కోరుతున్నా’ అంటూ చెప్పుకొచ్చాడు. దిల్ రాజు మాట్లాడుతూ.. ‘రాజమౌళి, సుకుమార్ మన సినిమాలను హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లారు. మలయాళ సినిమాల్లో కంటెంట్ బాగుంటుంది. అందుకే వారి సినిమాలకు తెలుగులో అభిమానులు ఎక్కువ. ఈ మూవీ కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుంది’ అంటూ తెలిపాడు.