Bank of Baroda: బ్యాంకింగ్ ఉద్యోగార్ధులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) 2025 సంవత్సరానికి సంబంధించి స్థానిక బ్యాంక్ ఆఫీసర్ (LBO) పోస్టుల భర్తీకి 2500 ఖాళీలతో భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. జూనియర్ మానేజ్మెంట్ గ్రేడ్ స్కేల్-I (JMG/S-I) ఈ పోస్టులు ఇందులో ఉండబోతున్నాయి. ఈ ఉద్యోగాలకోసం దరఖాస్తు ప్రక్రియ జూలై 4, 2025 నుండి ప్రారంభమై జూలై 24, 2025 వరకు కొనసాగుతుంది.
ఈ ఉద్యోగానికి అర్హతగా అభ్యర్థులు ఏదైనా సంబంధిత గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. వయస్సు పరిమితి 21 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి (01 జూలై 2025 నాటికి). అంతేకాందండోయ్.. ముఖ్యంగా అభ్యర్థులు Scheduled Commercial Bank (SCB) లేదా Regional Rural Bank (RRB) లో కనీసం ఒక సంవత్సరం ఆఫీసర్‌గా పని చేసిన అనుభవం ఉండాలి.
Read Also:Pawan Kalyan: నాకు ఇంటర్ సీట్ ఆయనే ఇప్పించారు.. ఆసక్తికర విషయం చెప్పిన పవన్!
ఎంపిక ప్రక్రియలో ఆన్‌లైన్ పరీక్ష, భాషా పరిజ్ఞాన పరీక్ష (LPT), సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్ మరియు ఇంటర్వ్యూలు ఉండబోతున్నాయి. ఎంపికైన అభ్యర్థులకు 48,480/- ప్రాథమిక జీతం, అదనంగా ఇతర భత్యాలు లభిస్తాయి. దరఖాస్తు ఫీజుగా GEN/OBC/EWS కేటగిరీలకు 850/-, SC/ST/PWD/ESM/Women కేటగిరీలకు 175/- వసూలు చేయబడుతుంది.
బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ పోస్టులను రాష్ట్రాల వారీగా భర్తీ చేయనుంది. అభ్యర్థులు అప్లై చేసే రాష్ట్రానికి సంబంధించి స్థానిక భాష మాట్లాడగలగడం తప్పనిసరి. రాష్ట్రాల వారీగా ఖాళీలు ఇలా ఉన్నాయి:
గుజరాత్ – గుజరాతీ భాష: 1160 ఖాళీలు
కర్ణాటక – కన్నడ భాష: 450 ఖాళీలు
మహారాష్ట్ర – మరాఠీ భాష: 485 ఖాళీలు
పంజాబ్ – పంజాబీ భాష: 50 ఖాళీలు
తమిళనాడు – తమిళ భాష: 60 ఖాళీలు
ఒడిశా – ఒడియా భాష: 60 ఖాళీలు
పశ్చిమ బెంగాల్ – బెంగాలీ భాష: 50 ఖాళీలు
అస్సాం – అస్సామీ భాష: 64 ఖాళీలు
కేరళ – మలయాళం భాష: 50 ఖాళీలు
గోవా – కొంకణీ భాష: 15 ఖాళీలు
ఇతర ఈశాన్య రాష్ట్రాలు – స్థానిక భాషలు ( మిజో, బోరో, ఖాసీ, మణిపురీ): 56 ఖాళీలు.
ఎంపిక విధానం (Selection Process):
బ్యాంక్ ఆఫ్ బరోడా LBO రిక్రూట్మెంట్ 2025 కోసం ఎంపిక విధానం అనేక దశల్లో జరుగుతుంది. మొదటి దశగా అభ్యర్థులు ఆన్‌లైన్ పరీక్ష (Online Exam) రాయాలి. ఈ పరీక్షలో నాలుగు విభాగాలు ఉంటాయి. ఇందులో ఇంగ్లీష్, బ్యాంకింగ్ నాలెడ్జ్, జనరల్/ఎకనామిక్ అవేర్‌నెస్, రీజనింగ్ అండ్ క్వాంటిటేటివ్ అప్పిట్యూడ్ ఉంటాయి. ప్రతి విభాగానికి 30 ప్రశ్నలు ఉండగా, వాటిని పూర్తి చేయడానికి 30 నిమిషాల సమయం కల్పించబడుతుంది. మొత్తం 120 ప్రశ్నలకు 120 నిమిషాల సమయం ఉంటుంది. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు, తప్పు సమాధానానికి 0.25 నెగటివ్ మార్కులు ఉంటాయి.
Read Also:Chaganti Koteswara Rao : ‘ఇది మర్యాద కాదు’ అంటూ చాగంటి ఫైర్..
ఆన్‌లైన్ పరీక్ష తర్వాత భాషా పరిజ్ఞాన పరీక్ష (LPT) ఉంటుంది. అభ్యర్థులు 10వ తరగతి లేదా 12వ తరగతిలో దరఖాస్తు చేసిన రాష్ట్రానికి సంబంధించిన స్థానిక భాషను చదవకపోతే, వారు ఈ పరీక్ష రాయడం తప్పనిసరి. ఇది అభ్యర్థి స్థానిక భాషలో కమ్యూనికేట్ చేయగలగడం ఉందో లేదో అంచనా వేయడానికి నిర్వహించబడుతుంది. తర్వాతి దశగా Psychometric Test లేదా ఇతర సంబంధిత టెస్టులు నిర్వహించబడతాయి. ఇవి అభ్యర్థి వ్యక్తిత్వ లక్షణాలు, ఆలోచనా విధానం, ఇంకా బ్యాంకింగ్ పాత్రకు అనుగుణంగా ఉన్నత స్థాయి అర్హతను అంచనా వేయడంలో సహాయపడతాయి.
ఇవి పూర్తి చేసిన అభ్యర్థులు గ్రూప్ డిస్కషన్ (GD) కు ఎంపిక చేయబడతారు. ఈ దశలో అభ్యర్థుల కమ్యూనికేషన్, టీం వర్క్, లీడర్‌షిప్ స్కిల్స్ ను పరీక్షిస్తారు. చివరగా ఇంటర్వ్యూకు (Interview) కు పిలుస్తారు. ఇది అభ్యర్థి ప్రొఫెషనల్ జ్ఞానం, అభిరుచి, ఇంకా బ్యాంక్‌కు అనుగుణంగా ఉండే మనస్తత్వాన్ని అంచనా వేయడానికి నిర్వహించబడుతుంది.
స్థానిక బ్యాంక్ ఆఫీసర్ (LBO) పోస్టుకు ఎంపికైన అభ్యర్థులకు ప్రారంభ బేసిక్ పే 48,480/- ఉంటుంది. ఇది Junior Management Grade Scale-I (JMG/S-I) కింద ఇచ్చే జీతం. దీనికి అదనంగా వివిధ రకాల భత్యాలు, సదుపాయాలు అందిస్తారు. వీటిలో డియర్‌నెస్ అలౌన్స్ (DA), హౌస్ రెంట్ అలౌన్స్ (HRA) లేదా లీజ్ ఫెసిలిటీ, సిటీ కంపెన్సేటరీ అలౌన్స్ (CCA), మెడికల్ సదుపాయాలు, నేషనల్ పెన్షన్ స్కీం (NPS) వంటివి ఉంటాయి.
ఇలాంటి ఆకర్షణీయమైన జీతం మరియు ప్రయోజనాలు ఈ ఉద్యోగాన్ని మరింత ప్రాధాన్యత గలదిగా మారుస్తున్నాయి. బ్యాంకింగ్ రంగంలో స్థిరతతో కూడిన కెరీర్ కోరుకునే అభ్యర్థుల కోసం ఇది మంచి అవకాశం. చివరి నిమిషం వరకూ వేచి ఉండకుండా ముందుగానే అప్లై చేయడం మంచిది. మరిన్ని వివరాలకు, దరఖాస్తు ఫారం కోసం అధికారిక www.bankofbaroda.in వెబ్‌సైట్ సందర్శించండి.