BAN vs AUS: ఆసీస్‌పై పంజా విసిరిన బంగ్లాదేశ్.! 86 పరుగుల తేడాతో భారీ విజయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BAN vs AUS: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో బంగ్లాదేశ్ 86 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఢాకాలో జరిగిన ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. అయితే డక్‌వర్త్-లూయిస్ (DLS) పద్ధతిలో ఆస్ట్రేలియాకు 42.2 ఓవర్లలో 278 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా, ఆసీస్ 191/9కే పరిమితమైంది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ టాంజిద్ హసన్ 54 పరుగులతో శుభారంభం అందించగా, నజ్ముల్ హొసైన్ షాంటో 67 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అయితే మ్యాచ్‌ను పూర్తిగా బంగ్లాదేశ్ వైపు మళ్లించింది మాత్రం మోసద్దెక్ హొసైన్. అతడు 70 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో అజేయంగా 86 పరుగులు చేసి జట్టుకు మంచి ఫైటింగ్ స్కోరు అందించాడు. చివర్లో టాస్కిన్ అహ్మద్ 20 పరుగులతో వేగంగా ఆడడంతో బంగ్లాదేశ్ స్కోరు 284 పరుగులకు చేరుకుంది. ఆస్ట్రేలియా బౌలర్లలో నాథన్ ఎల్లిస్ 3 వికెట్లు పడగొట్టగా.. లియామ్ స్కాట్, మ్యాట్ రెన్షా చెరో రెండు వికెట్లు సాధించగా, జేవియర్ బార్ట్లెట్ ఒక వికెట్ తీశాడు.
Also Read
- World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!
- AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
- AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
- Story Board: ఏపీలో లోకల్ వార్.. రిజర్వేషన్లు ఎవరికి లాభం..?
లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియాకు మొదట్లోనే భారీ షాక్ తగిలింది. తొలి బంతికే మాథ్యూ షార్ట్ డకౌట్ కాగా, మార్నస్ లబుషేన్ కూడా ఒక పరుగుకే వెనుదిరిగాడు. ఆ తర్వాత జోష్ ఇంగ్లిస్ (19), కూపర్ కానోలీ (35), అలెక్స్ క్యారీ (47) కొంతసేపు పోరాడినా బంగ్లా బౌలర్ల దెబ్బకు క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయారు. ఒకవైపు కెమెరాన్ గ్రీన్ 52 పరుగులతో అజేయంగా నిలిచినా.. అతడికి మరో ఎండ్ నుంచి సరైన సహకారం లభించలేదు. దీనితో తక్కువ స్కోర్ కే ఆస్ట్రేలియా పరిమితమైంది. బంగ్లాదేశ్ బౌలర్లలో నహీద్ రాణా 4 వికెట్లు పడగొట్టి ఆసీస్ బ్యాటింగ్‌ను కుప్పకూల్చాడు. మోసద్దెక్ హొసైన్, ముస్తాఫిజుర్ రెహ్మాన్ లు 2 వికెట్లతో రాణించారు. ఇంకా టాస్కిన్ అహ్మద్ ఒక వికెట్ సాధించాడు. బ్యాటింగ్‌లో అజేయ 86 పరుగులు, బౌలింగ్‌లో 2/37తో మెరిసిన మోసద్దెక్ హొసైన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌లో బంగ్లాదేశ్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
తాజావార్తలు
-
Explainer: TVS ఫ్యామిలీ గొడవేంటి?
-
World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!
-
Be Bald and Be Free Day : బట్టతల అంటే అందమే.. ఆత్మవిశ్వాసానికి కొత్త నిర్వచనం
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!