NTV Telugu Site icon

Bandi Sanjay Kumar: పార్టీ ఫిరాయింపులపై బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు..

Bandi Sanjay

Bandi Sanjay

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండిసంజయ్ పార్టీ ఫిరాయింపుల పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. నాడు బీఆర్ఎస్ అవలంబించిన విధానాలనే నేడు కాంగ్రెస్ పార్టీ పాటిస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యులకే నిధులు కేటాయించడం సమంజసం కాదని పేర్కొన్నారు. నేడు కాంగ్రెస్ పార్టీ పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతుందని..తెలంగాణలో అధికార పార్టీ దుర్మార్గమైన విధానం ఆలోచిస్తుందన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. టీ20 వరల్డ్ కప్ లో ఘన విజయం సాధించిన భారత్ జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోడీ కూడా భారత జట్టుకు శుభాకాంక్షలు తెలపడం జరిగిందని గుర్తుచేశారు.

READ MORE: Rain Alert: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. మూడు రోజుల పాటు భారీ వర్షాలు..

కాగా..గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో పాటు లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఖాతా తెరవకపోవడంతో రాష్ట్రంలో ఆ పార్టీ కథ ముగిసినట్లు కొందరు విశ్లేషిస్తున్నారు. దీంతో అందులో ఉన్న ఎమ్మెల్యేలు పార్టీలో ఉంటే తమకు భవిష్యత్ ఉండని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే కాంగ్రెస్, బీఆర్ఎస్ లో చేరేందుకు సంప్రదింపులు జరుపుతున్నాట్లు సమాచారం. ఎక్కువ మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరేందుకు మొగ్గు చూపుతున్నారు. బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసులు పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు. తాజాగా చేవెళ్ల నుంచి గెలిచిన కాలె యాదయ్య కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు దీపాదాస్‌ మున్షి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. యాదయ్య చేరికతో బీఆర్ఎస్ నుంచి చేరిన ఎమ్మెల్యేల సంఖ్య 6కు చేరింది.