Bandi Sanjay: ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సిట్ ఎదుట హాజరు కానున్నారు. ఈ కేసుకు సంబంధించి ఆయన పూర్తిస్థాయిలో అధ్యయనం చేస్తూ, ఆధారాలను సేకరించే పనిలో ఉన్నారు. దీనితో ఆయన గురువారం హైదరాబాద్‌లో కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ భేటీలో తెలంగాణకు చెందిన మాజీ పోలీసు ఉన్నతాధికారులు, సిట్, కౌంటర్ ఇంటలిజెన్స్ విభాగాల్లో పనిచేసిన అధికారులతో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆయన ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ అంశంపైనే చర్చ జరిపినట్లు సమాచారం.
Horoscope Today: శుక్రవారం దినఫలాలు.. ఆ రాశి వారికి డబ్బే డబ్బు!
ఇకపోతే నిఘా వర్గాల ప్రకారం, కేసీఆర్ ప్రభుత్వ హయాంలో బండి సంజయ్ ఫోన్లనే అత్యధికంగా ట్యాప్ చేసినట్లు తెలుస్తుంది. వాటికి సంబంధించిన ఆధారాలను సేకరించి ఆయనకు అందజేశారు. అయితే, ఈ అంశాన్ని బీజేపీ జాతీయ స్థాయిలో సీరియస్‌గా పరిగణిస్తోంది. గతంలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీజేపీ జాతీయ నేత బీఎల్ సంతోష్ ఫోన్‌ను కూడా ట్యాప్ చేశారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసును సీబీఐ విచారణకు అప్పగించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.
Su From So Review : సు ఫ్రమ్ సో రివ్యూ
బండి సంజయ్‌ను ఫోన్ ట్యాపింగ్ కేసులో గత జులై 24న విచారణకు హాజరు కావాలని సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. కాకపోతే ఆయన పార్లమెంటు సమావేశాల కారణంగా అప్పుడు హాజరుకాలేకపోయారు. ఇందుకు సంబంధించి ముందస్తు అనుమతి తీసుకుని నేడు విచారణకు హాజరవుతున్నారు. ఈ విచారణలో ఆయనతో పాటు ఆయన వ్యక్తిగత సిబ్బంది కూడా సిట్ ఎదుట హాజరవుతున్నారు.