కేసీఆర్ కుటుంబ అరాచక, అవినీతి పాలనకు వ్యతిరేకంగా రాజ్ గోపాల్ రెడ్డి రాజీనామా చేశారని ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలవడం ఖాయమన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. శనివారం ఆయన మాట్లాడుతూ.. ఒక పెద్ద స్వామీ కలిశారు…. కేసీఆర్ రమ్మంటే అయన పోలేదు… అయన నాకో విషయం చెప్పారు… కేసీఆర్ అనే మూర్ఖుడు దేనికైనా దిగజారుతాడు.. కేసీఆర్ చాలా రోజుల నుండి తాంత్రిక పూజలు చేస్తున్నాడు.. తాంత్రికుడి సూచన మేరకు మాత్రమే టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చాడంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
కేసీఆర్ దయ్యాల, రాక్షస క్షుద్ర పూజలు చేస్తున్నాడంటూ ఆయన విమర్శించారు. ఇదిలా ఉంటే.. మునుగోడు ఉప ఎన్నికపై బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు గెలుపుకు ఎవరికి వారే వ్యూహాలు పన్నుతున్నారు. అయితే.. మునుగోడు ఉప ఎన్నిక బరిలో బీజేపీ నుంచి రాజ్‌గోపాల్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి, అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ దిగనున్నారు. అయితే ప్రస్తుతం నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. వచ్చే నెల 3వ తేదీన మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ జరుగనుంది.