Site icon NTV Telugu

Bandi Sanjay : పాలమూరు ‘‘నిరుద్యోగ మార్చ్’’కు తరలిరండి

Bandi Sanjay

Bandi Sanjay

30 లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్తు కోసం బీజేపీ పోరు.. సీఎం స్పందించి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌. కేటీఆర్ ను బర్తరఫ్ చేసేవరకు, నిరుద్యోగులకు రూ.లక్ష పరిహారం ఇచ్చేదాకా పోరాడతామన్నారు. అయితే.. ఇవాళ ఆయన.. -ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పోలింగ్ బూత్ అధ్యక్షులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ ఉమ్మడి పాలమూరు జిల్లా కేంద్రంలో రేపు (ఈనెల 25న) జరగబోయే ‘‘నిరుద్యోగ మార్చ్‘‘ కు పెద్ద ఎత్తున తరలిరావాలని కార్యకర్తలకు, యువతకు పిలుపునిచ్చారు. 30 లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్తుకు సంబందించి టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై సీఎం స్పందించే వరకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు.

Also Read : Anchor Suma: అందరు చూస్తుండగానే సుమ గొంతు పట్టుకొని వార్నింగ్ ఇచ్చిన హీరో గోపీచంద్..

కేసీఆర్ ప్రభుత్వం గత 8 ఏళ్లుగా నిరుద్యోగుల గొంతు కోస్తోంది. బిశ్వాల్ కమిటీ నివేదిక ప్రకారం రాష్ట్రంలో 1.91 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, వాటిని భర్తీ చేస్తానని గతంలో చెప్పిన సీఎం కేసీఆర్ ఆ తరువాత మాట మార్చి అసెంబ్లీ వేదికగా 80 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పారు. కానీ నేటికీ ఒక్క ఉద్యోగం భర్తీ చేయకుండా కాలయాపన చేస్తోంది. 21 నోటిఫికేషన్లు విడుదల చేసినా ఏ ఒక్కటీ సక్రమంగా నిర్వహించలేదు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ పేరుతో నిరుద్యోగ యువత జీవితాలతో ఆడుకుంటోంది. కేసీఆర్ కుటుంబమే ఈ లీకేజీపై ఆరోపణలు వస్తున్నా కేసీఆర్ మాత్రం ఇంతవరకు స్పందించకపోవడం సిగ్గు చేటు. పేపర్ లీకేజీకి ఐటీశాఖ నిర్లక్ష్యమే కారణమైనప్పటికీ కేసీఆర్ కొడుకును బర్తరఫ్ చేయకపోగా, ఆయనను కాపాడుకోవడానికి సీఎం యత్నిస్తున్నారు.

Also Read : SRH vs DC: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకున్న ఢిల్లీ క్యాపిటల్స్

సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేస్తుంటే.. సిట్ పేరుతో దోషులను కాపాడే యత్నం చేస్తున్నారు. సిట్ చేసిన విచారణలేవీ ఇంతవరకు అతీగతీ లేదు. నయీం ఆస్తులు, డ్రగ్స్, మియాపూర్ భూముల కుంభకోణమే ఇందుకు కారణం.ఈ విషయాలన్నీ తాము ప్రస్తావిస్తుంటే ప్రజల ద్రుష్టిని మళ్లించేందుకు టెన్త్ పేపర్ లీక్ పేరుతో తనను అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అయినప్పటికీ తాము భయపడలేదని, తనను ఎక్కడ అరెస్ట్ చేశారో అక్కడి నుండి నిరుద్యోగ మార్చ్ నిర్వహించి బీజేపీ సత్తా చూపారు. అందులో భాగంగానే పాలమూరులో రేపు నిర్వహించబోయే ‘‘నిరుద్యోగ మార్చ్’’ కు ప్రతి ఒక్కరూ తరలి రావడంతోపాటు పెద్ద ఎత్తున యువతను మార్చ్ లో భాగస్వామ్యం చేయాలి. 30 లక్షల మంది యువత భవిష్యత్తుతో ముడిపడిన సమస్యపై సీఎం స్పందించి టీఎస్సీఎస్సీ పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించడంతోపాటు ఐటీశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలని, నిరుద్యోగులకు రూ.లక్ష పరిహారం ఇచ్చేదాకా బీజేపీ పోరాడుతుంది. పాలమూరులో జరగబోయే ‘‘నిరుద్యోగ మార్చ్’’ కు తరలిరావాలంటూ మీడియా, సోషల్ మీడియా వేదికగా విస్త్రత ప్రచారం చేయాలన కోరుతున్నా.’ అని ఆయన బండి సంజయ్‌ అన్నారు.

Exit mobile version