NTV Telugu Site icon

Bandi Sanjay : రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని మోసపూరిత హామీలే

Bandi Sanjay

Bandi Sanjay

నాగర్ కర్నూల్ జిల్లాలో ఈ నెల 25న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సభ ఏర్పాట్ల పై సన్నాహక సమావేశంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని మోసపూరిత హామీలే అని ఆయన విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో అవినీతికి పాల్పడిన వారు జైలుకు పొక తప్పదని ఆయన హెచ్చరించారు.

Also Read : Kadiyam Srihari : నా చేతికి ఖడ్గం ఇచ్చి నా బాధ్యత మరింత పెంచారు

ఇక్కడ కేసీఆర్‌ దుకాణం మూసి కొత్త దుకాణం ఓపెన్ చేసిండని, వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి పోటీచేస్తారన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన 30 మందిని కేసీఆర్ సెలక్ట్ చేసిండని, వారికి పార్టీ ఫండ్ కింద కోట్ల రూపాయలు ఇస్తుండని ఆయన అన్నారు. కేసిఆర్ బీఆర్ఎస్ అభ్యర్థుల కంటే కాంగ్రెస్ అభ్యర్థులు గెలవాలని కోరుకుంటాడన్నారు బండి సంజయ్‌. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీని జాకి పెట్టి లేపిన లేవదని ఆయన అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ కి అభ్యర్థులు కరువయ్యారని ఆయన ఎద్దేవా చేశారు. కమలం గుర్తుపై పోటీ చేసేందుకు అభ్యర్థులు ఎక్కువయ్యారని ఆయన అన్నారు. రాబోయేది పేదల రాజ్యం రామ రాజ్యమేనని బండి సంజయ్‌ అన్నారు. ఎన్నికల్లో బీజేపీ పార్టీ సింహం సింగిల్‌గా వస్తది గుంట నక్కలు గుంపులు గుంపులుగా వస్తారని బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు.

Also Read : JP Nadda: కాంగ్రెస్పై జేపీ నడ్డా ఫైర్.. 2014కి ముందు చాలా స్కాంలు చేశారని ఆరోపణ