NTV Telugu Site icon

Bandi Sanjay : కాంగ్రెస్ పార్టీలో గల్లీ నుండి ఢిల్లీ వరకు అందరూ ముఖ్యమంత్రులే

Bandi Sanjay

Bandi Sanjay

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేడ్కర్ చౌరస్తాలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. కరీంనగర్ లో చేల్లని రూపాయి హుస్నాబాద్ లో చెల్లుద్దని పొన్నం వచ్చాడా అని ఆయన అన్నారు. కేసీఆర్, కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేస్తే బీఆర్ఎస్ లో నలుగురు సీఎం పదవి కోసం కొట్లాడుతారని, కాంగ్రెస్ లో 70 మంది అభ్యర్థులకు ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టుబడి పెడుతున్నాడన్నారు. కాంగ్రెస్ పార్టీలో గల్లీ నుండి ఢిల్లీ వరకు అందరూ ముఖ్యమంత్రులే అని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితుల పై లాఠీ చార్జి చేస్తే అర్ధరాత్రి ఢిల్లీ నుండి వచ్చి వారిని ఆసుపత్రిలో చేర్పించి అండగా నిలిచానన్నారు.

Also Read : Revanth Reddy : ల్యాండ్ పూలింగ్ తో పేదల భూములు లాక్కునే ప్రయత్నం చేశారు

ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే సతీష్ కుమార్ కేసీఆర్ తో మాట్లాడి హుస్నాబాద్ కు ఎన్ని నిధులు తెచ్చాడో చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. కొంతమంది పోలీస్ ఆఫీసర్లు ప్రమోషన్ల కోసం కేసీఆర్ మోచేతి నీళ్లు తాగుతున్నారని, 30 వేల కోట్ల రూపాయలతో అయ్యే కాలేశ్వరం ప్రాజెక్టును లక్ష 30 వేల కోట్లకు పెంచి లక్ష కోట్లు దోచుకున్నారన్నారు. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గాని ఎవరైనా నిరుద్యోగుల కోసం కొట్లాడి జైలుకు పోయారా అని ఆయన వ్యాఖ్యానించారు. పొన్నం ప్రభాకర్ ఎప్పుడైనా జైలుకెళ్లాడా లాఠీ దెబ్బలు తిన్నాడా నేను లాఠీ దెబ్బలు తిన్నాను, జైలుకెళ్లానని, తిండికి లేని కేసీఆర్ కుటుంబానికి ఇవాళ లక్షల కోట్లు ఎలా వచ్చాయని బండి సంజయ్‌ ప్రశ్నించారు.

Also Read : CM KCR : 2014 వరకు చాలా జిల్లాల ప్రజలు ఉపాధి కోసం వలసలు వెళ్లేవారు..

Show comments