Bandi Sanjay: కేటీఆర్ వేసిన పరువు నష్టం దావా పై.. కౌంటర్ దాఖలు చేసిన బండి సంజయ్
- కేటీఆర్ వేసిన పరువు నష్టం దావా పై
- కౌంటర్ దాఖలు చేసిన బండి సంజయ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేటీఆర్ వేసిన పరువు నష్టం దావా పై కౌంటర్ దాఖలు చేశారు బండి సంజయ్. బండి సంజయ్ కుమార్ కౌంటర్ అఫిడవిట్‌లో పేర్కొన్న ప్రధాన అంశాలు.. తాను చేసిన వ్యాఖ్యలు ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టైన నిందితులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఉన్నాయని బండి సంజయ్ పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల కోసం ఫోన్‌లు ట్యాప్ చేయబడ్డాయని నిందితులు ఒప్పుకున్నారని అఫిడవిట్‌లో తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో కేటీఆర్ పాత్ర గురించి తనకు తెలియదని బండి సంజయ్ పేర్కొన్నారు. కేటీఆర్ తెలంగాణను అత్యంత సంపన్న రాష్ట్రంగా మార్చారన్న పిటిషనర్ వాదనను ఆయన తోసిపుచ్చారు.
Also Read:Cholera-Tenali: తెనాలిలో కలరా కలకలం.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు..!
Also Read
- Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
- BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
- CJP Leaders Released: సీజేపీ నాయకులకు బిగ్ రిలీఫ్.. అభిజీత్, సౌరవ్, అశుతోష్, ధృవ్ రాఠీ విడుదల..
- Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనలో వ్యవసాయం, విద్య, ఆరోగ్యం వంటి రంగాల్లో అవకతవకలు జరిగాయని బండి సంజయ్ ఆరోపించారు. 2014 నుండి 2023 నవంబర్ వరకు రాష్ట్ర అప్పులు భారీగా పెరిగాయని, అలాగే పెండింగ్ బిల్లులు కూడా పెరిగాయని ఆయన తెలిపారు. ఈ కేసులో కోర్టు ఇంజంక్షన్ మంజూరు చేస్తే, అది వాక్ స్వాతంత్ర్యానికి భంగం కలిగిస్తుందని బండి సంజయ్ పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై మాట్లాడినందుకు తన భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకోవడం సరికాదని ఆయన వాదించారు.
Also Read:Sree Vishnu: అక్టోబర్ 2న శ్రీ విష్ణు కొత్త సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసి ప్రతిపక్ష నాయకులు, న్యాయమూర్తులు, వ్యాపారవేత్తల ఫోన్‌లను ట్యాప్ చేయడానికి ఆదేశించారని బండి సంజయ్ ఆరోపించారు. కేటీఆర్ కోరిన రూ. 10 కోట్లు చెల్లించాల్సిన అవసరం లేదని బండి సంజయ్ అన్నారు. తాను చేసిన వ్యాఖ్యలు నిందితుల వాంగ్మూలం, ప్రభుత్వ పబ్లిక్ డాక్యుమెంట్ల ఆధారంగా ఉన్నందున క్షమాపణలు చెప్పడానికి కూడా నిరాకరించారు.
తాజావార్తలు
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
-
RT 78 : జెట్ స్పీడ్‌లో రవితేజ.. వివేక్ ఆత్రేయతో ‘తులాభారం’ స్టార్ట్
-
Thaman : తెలుగులో థమన్ బ్యాక్ ఆన్ ట్రాక్
-
BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!