కేటీఆర్ వేసిన పరువు నష్టం దావా పై కౌంటర్ దాఖలు చేశారు బండి సంజయ్. బండి సంజయ్ కుమార్ కౌంటర్ అఫిడవిట్‌లో పేర్కొన్న ప్రధాన అంశాలు.. తాను చేసిన వ్యాఖ్యలు ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టైన నిందితులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఉన్నాయని బండి సంజయ్ పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల కోసం ఫోన్‌లు ట్యాప్ చేయబడ్డాయని నిందితులు ఒప్పుకున్నారని అఫిడవిట్‌లో తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో కేటీఆర్ పాత్ర గురించి తనకు తెలియదని…
మంత్రి కొండా సురేఖపై కేటీఆర్ వేసిన పరువు నష్టం దావా కేసుపై నేడు నాంపల్లి స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టు విచారణ జరపనుంది. గత విచారణలో కేటీఆర్, దాసోజు శ్రవణ్ ల స్టేట్మెంట్ రికార్డ్ చేసిన కోర్టు.. ఈ రోజు మిగతా ముగ్గురు సాక్షులు తుల ఉమ, బాల్క సుమన్, సత్యవతి రాథోడ్ ల స్టేట్మెంట్‌లను కోర్టు రికార్డ్ చేయనుంది.