యంగ్ టైగర్ ఎన్టీఆర్ భారీ ముల్టీస్టారర్ వార్ 2. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తున్నాడు ఎన్టీఆర్. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లిమ్స్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేశాయి. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తుండగా అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ భారీ బడ్జెట్ చిత్రం ఏడాది ఆగస్టు 14 న ఈ సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది.
కాగా ఈ సినిమాను తెలుగు స్టేట్స్ లో సితార నాగవంశీ రిలీజ్ చేస్తుండగా ఆ సంస్థ రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్స్ ఏపీలోపంపిణి చేస్తున్నారు. ఈ సినిమాకు సంబందించి విశ్వసనీయ సమాచారం అందింది. హృతిక్ రోషన్ మరియు ఎన్టీఆర్ మధ్య సీన్స్ హోరాహోరిగా ఉండబోతున్నాయట. అయితే సినిమా స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన నటనతో హృతిక్ ను పూర్తిగా డామినేట్ చేసాడని అసలు టీజర్ లో కానీ ట్రైలర్ లో చూసింది జస్ట్ శాంపిల్ మాత్రమేనట. ఒక దశలో ఎన్టీఆర్ సినిమాలో హృతిక్ రోషన్ నటించాడు అనే ఫీలింగ్ కలుగుతుంది కథ మొత్తం ఎన్టీఆర్ చుట్టూ తిరుగుతుంది అని సమాచారం. ఒక్క మాటలో చెప్పాలంటే టెంపర్ నుండి దేవర వరకు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతూ వస్తున్న ఎన్టీఆర్ తన అభిమానులకు మాట ఇచ్చినట్టుగా కాలర్ ఎగరేసుకునే మరో సినిమా ఇవ్వబోతున్నాడు. వార్ 2 ఊహించిన దానికి మించి డబుల్ ఉండబోతుంది అని బాలీవుడ్ నుండి అందిన సమాచారం.