Balochistan: భారతదేశానికి పాకిస్తాన్ గడ్డ నుంచి తిరుగులేని మద్దతు వచ్చింది. ప్రముఖ బలూచ్ నాయకుడు, మానవ హక్కుల కార్యకర్త మీర్ యార్ బలూచ్ పాక్-చైనా సంబంధాలు తీవ్రం కావడంపై ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే కొన్ని నెలల్లో చైనా తన సైన్యాన్ని బెలూచిస్తాన్‌లో మోహరించవచ్చని ఆయన అన్నారు. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌కు రాసిన బహిరంగ లేఖలో, బెలూచిస్తాన్ దశాబ్దాలుగా పాకిస్తాన్ నియంత్రణలో అణచివేతను ఎదుర్కొంటోందని, అందులో ప్రభుత్వం మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
పాకిస్తాన్‌లోని సహజ వనరులపై జరుగుతున్న వాదనలను బలూచ్ నాయకుడు మీర్ యార్ బలూచ్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ ప్రాంతంలో ఉన్న విస్తారమైన చమురు, ఖనిజ నిల్వలు వాస్తవానికి పాకిస్తాన్‌కు కాదని, ‘రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్’కు చెందినవని ఆయన తెలిపారు. అధ్యక్షుడు ట్రంప్, అమెరికా ప్రభుత్వాన్ని పాకిస్తాన్ సైన్యం, ముఖ్యంగా ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ ‘పూర్తిగా తప్పుదారి పట్టించారని’ మీర్ యార్ బలూచ్ వెల్లడించాడు. పాకిస్తాన్ ఉగ్రవాదానికి ఆశ్రయం కల్పించే దేశంగా ఆయన అభివర్ణించారు. Also…