Balka Suman : చంద్రబాబు డైరెక్షన్లో రేవంత్ రెడ్డి నడుస్తున్నారు
- మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్
- పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రెస్ మీట్
- రేవంత్ రెడ్డి ఒక్క నాడు జై తెలంగాణ అనలేదని విమర్శ
- భద్రాచలం రూరల్ మండలంలోని 4 పంచాయతీలు తెలంగాణలో కలపాలని డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను అంధ్రాలో కలిపితేనే ప్రమాణ స్వీకారం చేస్తానని మోడీకి చెప్పానని చంద్రబాబు ఎన్డీఏ ఎమ్మెల్యేల సమావేశంలో చెప్పారని, ఏడు మండలాలను ఆంధ్రాలో కలపడంపై తెలంగాణ బంద్ కు బీఆర్ఎస్ పిలుపినిచ్చిందని మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్,పెద్ది సుదర్శన్ రెడ్డి. ఇవాళ వారు మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంటులో బీఆర్ఎస్ ఎంపీలుగా మేము కొట్లాడామని, లోయర్ సీలేరు పవర్ ప్రాజెక్టు ఆంధ్రాకు వెళ్ళిందన్నారు. ఏడు మండలాలపై సీఎం రేవంత్ రెడ్డి ఒక్క మాట మాట్లాడలేదని, చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎంగా వున్నారన్నారు. చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లో రేవంత్ రెడ్డి నడుస్తున్నారని బాల్కసుమన్ అన్నారు. ఏపీలో పని చేసిన ఆదిత్యనాధ్ దాస్ ను తెలంగాణ ఇరిగేషన్ సలహాదురుగా నియమించారని, పది సంవత్సరాల తర్వాత తెలంగాణపై చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి కలిసి కుట్రలు మొదలుపెట్టారని ఆయన వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి ఒక్క నాడు జై తెలంగాణ అనలేదని, రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి వుంటే పార్లమెంట్ ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిన విధంగా ఐదు గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలపాలన్నారు. భద్రాచలం రూరల్ మండలంలో ఉన్న యటపాక, కన్నాయిగూడెం, పురుషోత్తపట్నం, గుండాల పిచ్చుకలపాడు పంచాయతీలను తెలంగాణలో కలిపే విధంగా రేవంత్ రెడ్డి కృషి చేయాలన్నారు. రాష్ట్రంలో కరెంటు కోతలు నడుస్తున్నాయని, రైతులకు విత్తనాలు సరిగా అందించడం లేదన్నారు.
ఆదిత్యనాధ్ నియామకాన్ని వెంటనే రద్దు చేయాలన్నారు. తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తే చూస్తూ ఊరుకొమని, కాంగ్రెస్ అంటేనే కమీషన్ల ప్రభుత్వమన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై, కేసీఆర్ పైన కమీషన్లు వేస్తూ.. కాంగ్రెస్ మంత్రులు కమీషన్లు తీసుకుంటున్నారన్నారు. సింగరేణి బొగ్గు గనులను సింగరేణి సంస్థకు కేటాయించాలని కిషన్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నామని, బీజేపీ,కాంగ్రెస్ నేతలు తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం పని చేయాలన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు బయ్యారం ఉక్కు పరిశ్రమ,ఐటిఐఆర్ బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఇవ్వాలని, తెలంగాణ సమస్యల కోసం కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంటులో మాట్లాడాలన్నారు.
Also Read
- Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
- Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
అనంతరం ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘తెలంగాణ సివిల్ సప్లైస్ లో జరిగిన కుంభకోణంపై ప్రభుత్వం స్పందించడం లేదు. ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేవు.. రైస్ టెండర్లు,ప్యాడీ టెండర్లు రద్దు అయ్యాయా లేదా.. సీఎం రేవంత్ రెడ్డి పౌర సరఫరాల శాఖపై ఎందుకు రివ్యూ చేయడం లేదు.. సివిల్ సప్లైస్ కమిషనర్ అందుబాటులో ఉండటం లేదు.. మా దగ్గర ఉన్న ప్యాడీని లిఫ్ట్ చేయాలని రైస్ మిల్లర్లు జిల్లా కలెక్టర్లకు లేఖలు ఇచ్చారు.. టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు రైస్ మిల్లర్ల దగ్గర డబ్బులు మాత్రమే అడుగుతున్నారు.. సివిల్ సప్లైస్ కుంభకోణంలోసీఎం రేవంత్ రెడ్డి పాత్ర వుంది.. త్వరలోనే సివిల్ సప్లైస్ భవన్ ను ముట్టడిస్తాము..’ అని ఆయన వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!