అంతా ఉత్కంఠగా ఎదురుచూసిన బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం ముగిసింది. భారీ సంఖ్యలో పాల్గొన్న భక్తుల నడుమ వేలం ఆద్యాంతం ఆసక్తికరంగా సాగింది. బాలాపూర్ గణేష్ లడ్డూ ధర సరికొత్త రికార్డ్ ను సృష్టించింది. వేలంలో రూ. 35 లక్షలు పలికింది. లింగాల దశరథ గౌడ్ అనే భక్తుడు వేలం పాటలో బాలాపూర్ లడ్డూను దక్కించుకున్నాడు. 2024లో రూ.30.01 లక్షల ధర పలికిన విషయం తెలిసిందే. Also Read:US Tariffs: 2 నెలల్లో భారత్ క్షమాపణలు చెబుతుంది..…
బాలాపూర్‌లో 1994లో రూ.450తో ప్రారంభమైన ఈ లడ్డూ వేలం.. ప్రతీ ఏడాది పెరుగుతూ వచ్చింది.. 2023లో రూ.27 లక్షలు పలకగా.. 2024లో రూ.30.01 లక్షలకు చేరి తన రికార్డును తానే అధిగమించాడు బాలాపూర్ గణపయ్య..