Balakrishna : తన సినిమాలు సమాజానికి మెసేజ్ ఇస్తాయని హీరో బాలకృష్ణ అన్నారు. హిందూపురంలో అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. హిందూపురం మండలం కిరీకేర పంచాయతీ బసవనపల్లి ZPHS లో 64 లక్షలతో నిర్మించిన తరగతి గదుల భవనంను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. భవిష్యత్తులో ప్రజలకు ఉపయోగపడే విధంగా పనులు చేయాలని మా నాన్న ఎన్టీ రామారావు చెప్పారు. ఇలాంటి భవిష్యత్తు కార్యక్రమాలకు పునాది వేసింది కూడా ఆయనే. హిందూపురంలో పరిశ్రమలు, పాఠశాలలు స్థాపించింది ఎన్టీ రామారావే అని తెలిపారు బాలకృష్ణ.
read also : Nude Calls : ఈజీ మనీ కోసం న్యూడ్ కాల్స్, చాటింగ్.. గ్రామాల్లో కొత్త దందా
నాకు చదువు పట్ల అంతగా శ్రద్ధ ఉండేది కాదు. ఎలాగో అలాగా డిగ్రీ పూర్తి చేశాను. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత సినీ రంగాల్లోకి అడుగు పెట్టాను. విద్యార్థులు భారతదేశ పౌరులుగా ఎదగాలని ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులు మంచి పేరు తేవాలి. నేను నటించిన సినిమాల్లో, అఖండ, భగవంత్ కేసరి, వీర వీర సింహారెడ్డి, ప్రజలకు విద్యార్థులకు ఉపయోగపడే విధంగా సందేశాలు ఇచ్చాయి. ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడమే కాకుండా.. వారికి ఉపయోగపడే విధంగా సినిమాలు చేయాలన్నదే నా ఉద్దేశం అని తెలిపారు బాలకృష్ణ.
read also : Hanamkonda Collectorate : కలెక్టరేట్ లో కామాంధుడు.. సిబ్బందిపై అత్యాచారయత్నం..
