Balakrishna : తన సినిమాలు సమాజానికి మెసేజ్ ఇస్తాయని హీరో బాలకృష్ణ అన్నారు. హిందూపురంలో అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. హిందూపురం మండలం కిరీకేర పంచాయతీ బసవనపల్లి ZPHS లో 64 లక్షలతో నిర్మించిన తరగతి గదుల భవనంను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. భవిష్యత్తులో ప్రజలకు ఉపయోగపడే విధంగా పనులు చేయాలని మా నాన్న ఎన్టీ రామారావు చెప్పారు. ఇలాంటి భవిష్యత్తు కార్యక్రమాలకు పునాది వేసింది కూడా ఆయనే. హిందూపురంలో పరిశ్రమలు, పాఠశాలలు…