ఐపీఎల్ 2024లో భాగంగా.. మంగళవారం ముంబైతో జరిగిన మ్యాచ్‌లో లక్నో విజయం సాధించింది. దీంతో.. ఆ జట్టుకు ప్లేఆఫ్ చేరుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే కీలక సమయంలో లక్నో జట్టుకు ఇదొక బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇప్పటికే ఒకసారి గాయపడిన ప్లేయర్‌ను మ్యాచ్‌లోకి తీసుకొచ్చి మళ్లీ భారీ గాయం చేశారు.
Read Also: Chamomile Tea Benefits: చామంతి టీతో అద్భుత ప్రయోజనాలు.. గుండెకు ఎంతో మంచిది..
లక్నో సూపర్ జెయింట్స్ జట్టు పేసర్ మయాంక్ యాదవ్ గాయం తిరగబడినట్లు సమాచారం. నిన్న ముంబైతో జరిగిన మ్యాచ్ లో ఆయన 3.1 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసి గ్రౌండ్ నుంచి బయటకు వెళ్లిపోయాడు. ఆయన కోటాను నవీన్ ఉల్ హక్ పూర్తి చేశారు. మయాంక్ పూర్తిగా కోలుకోకుండానే ముంబైతో మ్యా్చ్లో ఆడించినట్లు క్రీడా నిపుణులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో వెంటనే గాయం తిరగబెట్టిందని భావిస్తున్నారు.
Read Also: Hari Ramajogaiah: ఎన్డీఏ కూటమికి విజ్ఞప్తి అంటూ హరి రామజోగయ్య లేఖ..
కాగా.. నిన్న ముంబైతో జరిగిన మ్యాచ్ లో లక్నో 4 వికెట్లు తేడాతో గెలుపొందింది. లక్నో బ్యాటింగ్ లో మార్కస్ స్టోయినీస్ (62) పరుగులతో చెలరేగడంతో.. ఆ జట్టు విజయం సాధించింది. లక్నో తన తర్వాతి మ్యాచ్ కోల్‌కతాతో ఆడనుంది.