BAC Meeting: ఈ నెల 26 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. బీఏసీలో ఖరారు
- ముగిసిన బీఏసీ సమావేశం
- 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BAC Meeting: ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. బీఏసీ సమావేశానికి సీఎం చంద్రబాబు, పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, విష్ణు కుమార్ రాజు హాజరయ్యారు. దీనికి వైసీపీ నేతలు గైర్హాజరయ్యారు. సమావేశాల అజెండాను బీఏసీ ఖరారు చేసింది. 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 26 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. సభలో అన్ని శాఖలపై శ్వేతపత్రాలు విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ అసెంబ్లీలో ఏయే అంశాలపై చర్చించాలనే దానిపై నిర్ణయం తీసుకున్నారు.
Read Also: CM Chandrababu: మదనపల్లె సబ్ కలెక్టరేట్‌లో అగ్నిప్రమాదం ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష
Also Read
- Smriti Mandhana: బాలల హక్కుల కోసం స్మృతి మంధాన ముందడుగు.. ఆహ్వానించిన సచిన్ టెండూల్కర్..
- Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
- Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
- Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. సమావేశాలు ప్రారంభమైన వెంటనే ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగం అనంతరం శాసనసభ రేపటికి వాయిదా పడింది. అనంతరం స్పీకర్ అధ్యక్షతన శాసనసభా వ్యవహారాల సలహా కమిటీ (బీఏసీ) సమావేశం ఏర్పాటు చేశారు. గవర్నర్ ప్రసంగంపై మంగళవారం చర్చ జరగనుంది. గత సర్కారు తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేస్తూ ఉపసంహరణ బిల్లులను ప్రభుత్వం మంగళవారం సభలో ప్రవేశపెట్టనుంది.
అనంతరం సభాపతి అయ్యన్నపాత్రుడు మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడారు. గత సమావేశాలు వరకూ గవర్నరుని అసెంబ్లీకి దొడ్డిదారిన తెచ్చినట్లుగా చుట్టూ తిప్పి వెనుక నుంచి తీసుకొచ్చేవారని.. ఈ సమావేశాలకు గవర్నరును రాచమార్గంలో ముందు వైపు నుంచి తీసుకొచ్చామన్నారు. అసెంబ్లీకి రాచమార్గం ఉండాలనే గోడ కూల్చి గేట్-2 తలుపులు తీశామన్నారు. నలుగురు ప్యానల్ స్పీకర్లను పెట్టుకోమని సీఎం సూచించారని.. అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 26 వరకు జరుగుతాయన్నారు. 2 బిల్లులను ప్రభుత్వం ప్రవేశ పెట్టనుందని వెల్లడించారు. ల్యాoడ్ టైటిలింగ్ చట్టం రద్దు బిల్లుతో పాటు ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ పేరు పునరుద్ధరణ బిల్లు కూడా ఉంటుందన్నారు. ప్రభుత్వం కొన్ని శ్వేత పత్రాలు ప్రవేశపెట్టనుందని స్పీకర్ వెల్లడించారు. 88మంది మొదటిసారి గెలుపొందిన ఎమ్మెల్యేలు ఉన్నందున వచ్చే సమావేశాల్లోపు వారికి శిక్షణ ఇస్తామన్నారు. అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాలు 80 శాతం మేర పూర్తయి ఉన్నాయన్నారు. 6 నెలల్లోగా వాటిని సభ్యులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించామన్నారు. 9 నెలల్లో అందుబాటులోకి తెస్తామని అధికారులు చెప్పారని సభాపతి స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
-
Smriti Mandhana: బాలల హక్కుల కోసం స్మృతి మంధాన ముందడుగు.. ఆహ్వానించిన సచిన్ టెండూల్కర్..
-
Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
-
Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
-
Indigo : పవర్ బ్యాంక్‌లో మంటలు.. శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..