టాలీవుడ్‌లో వరుసగా సెలబ్రేటీలు జీవితంలో కొత్త అధ్యాయాన్ని ఆరంభిస్తున్న తరుణంలో, ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కూడా తన ప్రేయసి హరిణ్యను వివాహం చేసుకుని కొత్త జీవితం లోకి అడుగుపెట్టారు. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట, పెద్దల ఆశీర్వాదాల మధ్య నవంబర్ 27న అంటే నేడు అంగరంగ వైభవంగా వివాహ బంధంతో ఒకటయ్యారు. ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారి నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.
Also Read : Kantara – Chapter 1: ‘కాంతారా’ హిందీ OTT రిలీజ్.. ఎక్కడ స్ట్రీమ్ అవుతుందో తెలుసా?
రాహుల్ సిప్లిగంజ్ టాలీవుడ్‌లో సింగర్‌గా భారీ విజయాలు సొంతం చేసుకున్నాడు. ముఖ్యంగా “నాటు నాటు” పాటకు ఆస్కార్ అవార్డు రావడం ఆయన క్రేజ్, ప్రతిభ స్థాయి ప్రపంచానికి చాటి చెప్పింది. కెరీర్ పరంగా అత్యంత బిజీగా ఉన్న రాహుల్, వ్యక్తిగతంగా హరిణ్య తో ప్రేమలో ఉన్న విషయం చాలా కాలంగా ఇండస్ట్రీలో టాక్‌గా ఉంది. హరిణ్య రాజకీయ కుటుంబానికి చెందిన యువతి. గత రెండు నెలల క్రితం ఈ జంట ఘనంగా నిశ్చితార్థం జరుపుకుని తమ ప్రేమను అధికారికం ప్రకటించారు.
తాజాగా జరిగిన వివాహ వేడుక కుటుంబ సభ్యులు, సినీ రాజకీయ ప్రముఖులు పాల్గొనేలా అత్యంత వైభవంగా నిర్వహించినట్లు సమాచారం. రాహుల్–హరిణ్య వివాహ ఫోటోలు వీరిద్దరూ అధికారికంగా షేర్ చేయకపోయినా, సోషల్ మీడియాలో దర్శనమైన ఫోటోలు ప్రస్తుతం వైరల్‌గా మారి ట్రెండింగ్‌లో నిలుస్తున్నాయి. కాగా సంప్రదాయ దుస్తుల్లో జరిగిన ఈ పెళ్లి ఎంతో అందంగా, పద్ధతి ప్రకారం జరిగిందని తెలుస్తోంది. ఇప్పటికే నేటిజన్లు ఈ కొత్త జంట పై అభినందనల వర్షం కురిపిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం వరకు వారి ప్రీ–వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మెహందీ, హల్ది వేడుకలకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో మంచి క్రేజ్ సాధించాయి.