UP: లవర్ కోసం ముస్లింగా మారిన యువకుడు.. మళ్లీ హిందువు మతంలోకి వచ్చేశాడు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UP: ఉత్తరప్రదేశ్ శామ్లీ జిల్లాలో సంచలనం సృష్టించిన ఆయుష్ మాలిక్ మత మార్పిడి వ్యవహారం మరో మలుపు తిరిగింది. యూపీ యాంటీ-కన్వర్షన్ చట్టం కింద పోలీసుల విచారణకు దారితీసిన ఈ కేసులో.. ఆయుష్ మాలిక్ తిరిగి హిందూ మతాన్ని స్వీకరించాడు. తన తల్లిదండ్రుల పడుతున్న బాధను చూసి, తన సొంత ఇష్టపూర్వకంగానే మళ్లీ సనాతన ధర్మానికి తిరిగి వచ్చినట్లు ఆయుష్ ప్రకటించాడు. హిందూ మతంలోకి తిరిగి వచ్చిన తర్వాత ఆయుష్ సాంప్రదాయబద్ధంగా పూజలు, ఆచారాలు నిర్వహిస్తున్న ఓ వీడియో ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. ఆ వీడియోలో ఆయుష్ మాట్లాడుతూ.. “నేను గతంలో ఇస్లాం మతంలోకి మారి నా మతాన్ని మార్చుకున్నాను. కానీ నా తల్లిదండ్రుల బాధను చూసి, నా కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని, నా స్వచ్ఛంద నిర్ణయంతోనే మళ్లీ హిందూ మతంలోకి తిరిగి వచ్చాను. ఇకపై నా కుటుంబ రక్షణలోనే, వారితో పాటే జీవించాలనుకుంటున్నాను” అని స్పష్టం చేశాడు. ఆయుష్ తండ్రి దేవరాజ్ మాలిక్ కూడా తన కుమారుడు అధికారికంగా తిరిగి సనాతన ధర్మాన్ని స్వీకరించినట్లు ధృవీకరించారు.
అసలు ఏం జరిగింది?
బీ-ఫార్మా పూర్తి చేసి, తన కుటుంబానికి చెందిన మెడికల్ స్టోర్‌ను చూసుకునే ఆయుష్ మాలిక్‌కు 2018లో కాలి గాయానికి చికిత్స తీసుకుంటున్న సమయంలో చాందిని ఖురేషి అనే ఫిజియోథెరపిస్ట్‌తో పరిచయమైంది. పోలీసుల కథనం ప్రకారం.. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో చాందిని, ఆమె తండ్రి ఇస్లాం ఖురేషి కలిసి ఆయుష్‌ను క్రమంగా ఇస్లాం వైపు ఆకర్షించేలా మైండ్ వాష్ చేశారు. ఆ తర్వాత 2023లో ఆయుష్‌ను ఢిల్లీకి తీసుకెళ్లి, అక్కడ ముస్లిం మతంలోకి మార్చి ‘మొహమ్మద్ అలీ’గా పేరు మార్చారు. అక్కడ నికా (పెళ్లి) కూడా జరిపించినట్లు ఆరోపణలు ఉన్నప్పటికీ, దానికి సంబంధించిన ఎలాంటి వివాహ ధృవీకరణ పత్రాలు పోలీసుల విచారణలో లభించలేదు. మత మార్పిడి తర్వాత ఆయుష్ గడ్డం పెంచడం, రోజుకు ఐదుసార్లు నమాజ్ చేయడం, ముస్లిం సాంప్రదాయ దుస్తులు ధరించడం వంటివి చేయడం ప్రారంభించాడు.
Also Read
- KTR: ‘‘చావు నోట్లో తల పెట్టయినా.. మీకు గుర్తింపు తెస్తా’’.. ‘ది ప్యారడైజ్’ సినిమాపై కేటీఆర్ సంచలన రివ్యూ
- Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
- AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
- IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
అయితే, తమ కుటుంబానికి ఉన్న కోట్ల రూపాయల విలువైన ఆస్తులను హస్తగతం చేసుకోవాలనే పక్కా ప్లాన్, కుట్రతోనే చాందిని కుటుంబం తన కొడుకును బ్రెయిన్ వాష్ చేసి మతం మార్చిందని ఆయుష్ తండ్రి దేవరాజ్ మాలిక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు ఆధారంగా యూపీ పోలీసులు భారతీయ న్యాయ సంహిత’ (BNS), ఉత్తరప్రదేశ్ చట్టవిరుద్ధ మత మార్పిడి నిషేధ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో కొన్ని వారాల క్రితమే ఫిజియోథెరపిస్ట్ చాందిని ఖురేషిని, ఆమె తండ్రి ఇస్లాం ఖురేషిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయుష్ మళ్లీ తన స్వగృహానికి చేరి హిందూ మతంలోకి మారడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
తాజావార్తలు
-
KTR: ‘‘చావు నోట్లో తల పెట్టయినా.. మీకు గుర్తింపు తెస్తా’’.. ‘ది ప్యారడైజ్’ సినిమాపై కేటీఆర్ సంచలన రివ్యూ
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు అప్రమత్తంగా ఉండాల్సిందే!
-
India’s UNSC Permanent Seat Bid: భారత్ UNSC శాశ్వత సభ్యత్వానికి రష్యా మద్దతు.. UNGAలో లావ్రోవ్ కీలక వ్యాఖ్యలు
-
LNG Dual-Fuel Train in India: భారత రైల్వేలో కొత్త అధ్యాయం.. నేడు అమిత్ షా చేతుల మీదుగా తొలి LNG రైలు ప్రారంభం
-
OTR: పశ్చిమ గోదావరిలో వైసీపీకి ఏం జరుగుతోంది?
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?