NTV Telugu Site icon

Ayodhya gangrape: అయోధ్య గ్యాంగ్‌రేప్ నిందితుడి షాపింగ్ కాంప్లెక్స్ నేలమట్టం..(వీడియో)

Ayodya

Ayodya

అయోధ్య అత్యాచారం కేసులో నిందితుడైన సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు మొయీద్ ఖాన్ మల్టీ కాంప్లెక్స్‌పై బుల్డోజర్ చర్య ప్రారంభమైంది. ఈ కాంప్లెక్స్‌లో నడుస్తున్న బ్యాంక్ ను ఇంకో చోటుకు మార్చే వరకు అధికారులు వేచి ఉన్నారు. తాజాగా బ్యాంకు కార్యకలాపాలు మరో భవనంలోకి మార్చడమే కాకుండా.. వ్యాపార సముదాయం లోని ఇతర దుకాణాలు కూడా ఖాళీ చేశారు. దీంతో అధికారులు గురువారం దుకాణ సముదాయంపైకి మూడు బుల్డోజర్లను పంపారు. ఏకకాలంలో అక్రమ నిర్మాణాలు నేలమట్టమయ్యాయి. ఈ విషయంపై రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి.

READ MORE: India Tour to England: భారత్-ఇంగ్లాండ్ పర్యటన షెడ్యూల్‌ విడుదల..

ఈ మల్టీ కాంప్లెక్స్‌లో మూడింట ఒక వంతు భాగం చట్టవిరుద్ధంగా ఉందని అధికారులు తెలిపారు. ఇందులో ప్రభుత్వ బ్యాంకు కూడా ఉంది. అక్రమ భాగంలో నడుస్తున్న దుకాణాలపై పరిపాలన నోటీసులు అతికించిందని చెప్పారు. దీంతో ఇక్కడి నుంచి బ్యాంకు సహా దుకాణాలు వేరే చోటుకు తరలించారు. బుల్డోజర్ చర్యకు ముందే తగిన భద్రతా ఏర్పాట్లు చేశారు. దీనికి ముందు మొయీద్ ఖాన్ బేకరీని కూడా బుల్డోజర్‌తో కూల్చివేశారు.

READ MORE:Kolkata doctor case: బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీ ప్రదర్శన.. న్యాయం చేయాలని డిమాండ్

అయితే.. అయోధ్య డెవలప్‌మెంట్ అథారిటీ కార్యదర్శి ఎస్పీ సింగ్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. “గత మార్చి నుంచి మొయీద్ అహ్మద్‌కు షాపింగ్ కాంప్లెక్స్ లపై నోటీసులు జారీ చేశాం. అయితే అతని అహంకారం కారణంగా నోటీసు తీసుకోలేదు. ఈ నిర్మాణం చట్ట విరుద్ధంగా కట్టినట్లు డెవలప్‌మెంట్ అథారిటీ మ్యాప్‌ను కూడా సమర్పించింది. చెరువు, గ్రామ సొసైటీ భూమిని ఆక్రమించి ఈ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించారని నోటీసులో పేర్కొన్నాం. నోటీసుకు స్పందించకపోవడంతో ఈ చర్య తీసుకున్నాం.” అని ఆయన తెలిపారు.

READ MORE:Vijay : విజయ్ పార్టీకి చిరు ప్రజారాజ్యానికి ఉన్న సంబంధం ఏంటో తెలుసా..?

అసలేంటి ఈ ఘటన…
కాగా… ఉత్తర్ ప్రదేశ్ రాజకీయాల్లో అయోధ్య గ్యాంగ్ రేప్ ఘటన సంచలనంగా మారింది. 12 ఏళ్ల బాలికపై ఇద్దరు నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో నిందితుడైన మోయిద్ ఖాన్ సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) కీలక నేతగా ఉన్నారు. మోయిద్ ఖాన్, అతని ఉద్యోగి రాజుఖాన్ మూడు నెలల క్రితం 12 ఏళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడినట్లు తేలింది. ఆ తర్వాత రెండు నెలలు కూడా బాలికను లైంగికంగా వేధించారు. ఆమెను బెదిరించేందుకు లైంగిక దాడి సమయంలో తీసిన వీడియోలను ఉపయోగించారు. మోయిద్ ఖాన్‌కి రాజు ఖాన్ సాయం చేశాడు. మైనర్ గర్భవతి అని తేలడంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. జూలై 30న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. యూపీ సీఎం యోగి బాధితురాలి తల్లిని కలుసుకుని ఆమెకు న్యాయం చేస్తానమని హామీ ఇచ్చారు.