Ayesha Meera Mother: విజయవాడలో అయేషా మీరా హత్య జరిగి 15 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ‘ఇంకెన్నాళ్లు’ పేరుతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అయేషా మీరా తల్లి శంషాద్ బేగం మాట్లాడుతూ.. అయేషా హత్యకు గురై 15 ఏళ్లు అయ్యిందని.. ఐపీఎస్ అధికారి ఆనంద్, ప్రస్తుత డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి కేసును తప్పు దోవ పట్టించారని ఆరోపించారు. సత్యం బాబును అరెస్టు చేసినా కోర్టులో దోషిగా నిర్ధారించలేదన్నారు. 2018 డిసెంబరులో కేసు సీబీఐ…
ఆయేషా మీరా తల్లి సీజేఐ ఎన్వీ రమణకు బహిరంగ లేఖ రాశారు. 14 ఏళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్నా ఫలితం లేదని లేఖలో పేర్కొన్నారు. సీబీఐ దర్యాప్తు మధ్యలోనే ఎందుకు ఆపివేసారో తెలియడం లేదన్నారు. నేరస్థులు ఎవరో తెలిసినా దర్యాప్తు సంస్ధలు పట్టుకోలేని స్ధితిలో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవస్థలో న్యాయం జరగదని మీరు ఆమోదముద్ర వేస్తే మూగజీవాలుగా మిగిలిపోతామని లేఖలో అయేషా మీరా తల్లి పేర్కొన్నారు. ఇదిలా వుండగా… సీజేఐ జస్టిస్ ఎన్వీ…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్యకేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.. ఈ కేసులో నిందితులకు నార్కో ఎనాలసిస్ పరీక్షలు నిర్వహించాలంటూ సీబీఐ వేసిన పిటిషన్‌ను విజయవాడ కోర్టు కొట్టివేసింది.. ఈ కేసులో మొత్తం ఏడుగురు నిందితులకు నార్కో ఎనాలసిస్ టెస్ట్‌లు నిర్వహించాలని.. అందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా పిటిషన్ దాఖలు చేసింది సీబీఐ.. అయితే, నిందితుల తరపున న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్ వాదనలు వినిపించాడు.. ఇరు పక్షాల వాదనలు విన్న విజయవాడ కోర్టు..…