Karthika : రంగం భామ ఎంగేజ్మెంట్..? వైరల్ అవుతున్న పిక్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ రాధ గురించి పరిచయం చేయాల్సిన పని లేదు.మెగాస్టార్ చిరంజీవి సరసన అధిక చిత్రాల్లో నటించి రాధ స్టార్ బ్యూటీగా వెలుగు వెలిగింది..అలాగే రాధ కుమార్తె కార్తీక నైర్ కూడా తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయింది..టాలీవుడ్ లో కార్తీక నాగ చైతన్య సరసన జోష్ చిత్రంతో హీరోయిన్ గా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చింది. అలాగే తమిళంలో కూడా పలు చిత్రాల్లో నటించింది కార్తీక. రంగం చిత్రంతో ఈ భామ బిగ్గెస్ట్ బ్లాక్ బ్లాస్టర్ హిట్ అందుకుంది.. ఆ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన దమ్ము చిత్రంలో హీరోయిన్ గా నటించి మెప్పించింది. ఆ సినిమా అంతగా ఆకట్టుకోకపోవడం తో ఈ భామకు ఆ తర్వాత సరైన అవకాశాలు రాలేదు.తెలుగులో అల్లరి నరేష్ తో కలిసి బ్రదర్ ఆఫ్ బొమ్మాళి సినిమాలో నటించింది. ఆ సినిమా కూడా అంతగా ఆకట్టుకోలేదు. దీనితో ఈ భామకు తెలుగులో అవకాశాలు రాలేదు.
ఇటీవల కార్తీక సినిమాల పరంగా అంత యాక్టివ్ గా అయితే లేదు. అయితే సడెన్ గా కార్తీక నైర్ ఎంగేజ్మెంట్ పూర్తయింది అంటూ తమిళనాట కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇందుకు తగ్గట్లుగానే కార్తీక ఇంస్టాగ్రామ్లో ఓ క్రేజీ పోస్ట్ ను పెట్టింది. కార్తీక ఓ వ్యక్తిని హగ్ చేసుకుని ఉన్న పిక్ ని ఆమె ఇన్స్టాలో పోస్ట్ చేసింది. ఈ పిక్ లో తన వేలికి ఉన్న రింగ్ కూడా హైలైట్ అయ్యేలా ఫోజు ఇచ్చింది. దానితో కార్తీక నిశ్చితార్థం చేసుకుంది అని నెటిజన్లు భావిస్తున్నారు.వరుడి ఎవరు అంటూ నెటిజన్లు ఆరా తీయడం కూడా ప్రారంభించారు. అయితే కార్తీక ఎంగేజ్మెంట్ గురించి కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరోవైపు కార్తీక నిశ్చితార్థం పూర్తయింది అని.. ఆమె వివాహం కూడా త్వరలోనే జరగనుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.హీరోయిన్ గా ఆశించిన ఆఫర్స్ రాకపోవడంతో కార్తీక నైర్ వివాహం చేసుకోవాలనే నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది. అయితే కార్తీక ది లవ్ మ్యారేజ్ లేక అరేంజ్డ్ మ్యారేజ్ అనేది ఇంకా క్లారిటీ లేదు. ఆమె నిశ్చితార్థం గురించి అధికారిక ప్రకటన, పెళ్లి తేదీ లాంటి వివరాలు త్వరలోనే కుటుంబ సభ్యులు వెల్లడించనున్నట్లు సమాచారం.
Also Read
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!