Cane Toad: ఆస్ట్రేలియా రేంజర్లు కాన్వే జాతీయ పార్కులో దాదాపు ఫుట్‌బాల్ సైజులో ఉన్న అతి పెద్ద కప్పను(కేన్ టోడ్) కనుగొన్నారు. దీన్ని వారు ‘టోడ్జిల్లా’గా పిలుస్తున్నారు. ఈ కప్ప సుమారు 2.7 కిలోల బరువు ఉన్నదని క్వీన్స్‌లాండ్ పర్యావరణ, శాస్త్ర విజ్ఞాన విభాగం శుక్రవారం వెల్లడించింది. ఈ కప్ప కొత్త ప్రపంచ రికార్డు సృష్టిస్తుందని ఆస్ట్రేలియా అధికారులు భావిస్తున్నారు. గతంలో 2.65 కేజీల బరువున్న కప్ప అతి పెద్దదిగా గిన్నిస్ రికార్డుల్లో నమోదైంది.స
Read Also: Kidnap : కిడ్నాప్ అయిన వ్యక్తుల కోసం ఒక్కటైన గ్రామం.. తర్వాత ఏం జరిగిందంటే
చెరకు పంటలో తెగుళ్లను నియంత్రించడానికి 1935లో ఆస్ట్రేలియాలో కేన్ టోడ్‌లను ప్రవేశపెట్టారు. ప్రస్తుతం వాటి జనాభా విపరీతంగా పెరిగిపోయింది. అవి ఆస్ట్రేలియన్ జాతులకు ముప్పుగా మారాయని పర్యారణ వేత్త నోలన్ చెప్పారు. ఆడ టోడ్జిల్లా 35,000 గుడ్లు పెడుతుంది. వాటి పునరుత్పత్తి సామర్థ్యం అస్థిరమైనది. కేన్ టోడ్ సంతానోత్పత్తి చక్రంలోని అన్ని భాగాలు ఆస్ట్రేలియన్ స్థానిక జాతులకు హానికరం. కాబట్టి వాటిని నివారించాలని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు.
Read Also:Giant Pendulum : జీవితంలో మరోసారి జాయింట్ వీల్ పదం అంటే హడలిపోతారేమో !