WTC Final 2023: మూడోరోజు 300 ఆధిక్యానికి చేరువలో ఆసీస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐసీసీ వరల్డ్ ఛాంపియన్ షిప్ ఫైనల్ 2023 మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 44 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 123 పరుగుల స్కోరు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో దక్కిన 173 పరుగుల ఆధిక్యంతో కలిపి ఆసీస్ ప్రస్తుతం 296 పరుగుల తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. రెండో ఇన్నింగ్స్ మొదలెట్టిన ఆస్ట్రేలియా ఓపెనర్లను త్వరగా ఔట్ చేశారు. 8 బంతుల్లో 1 పరుగు చేసిన డేవిడ్ వార్నర్, మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ శ్రీకర్ భరత్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 39 బంతుల్లో 2 ఫోర్లతో 13 పరుగులు చేసిన ఉస్మాన్ ఖవాజా, ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో డగౌట్ కి పంపించాడు.
Read Also : Bihar : డేటింగ్ యాప్ తో వల.. యువకులే కిలేడి టార్గెట్..
Also Read
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- Vaibhav's Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
- Vignesh Shivan : నయనతార భర్త విఘ్నేశ్ శివన్ నా ఆఫీసులో మూడేళ్లు పనిచేశాడు.. ఆ రూమర్లపై నటి సోనా షాకింగ్ కామెంట్స్!
ఉమేశ్ యాదవ్‌కి ఈ మ్యాచ్‌లో ఇదే తొలి వికెట్.. ఆ తర్వాత స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్ కలిసి మూడో వికెట్‌కి 62 పరుగుల భాగస్వామ్యం జోడించారు. 47 బంతుల్లో 3 ఫోర్లతో 34 పరుగులు చేసిన స్టీవ్ స్మిత్ రవీంద్ర జడేజా బౌలింగ్‌లో శార్దూల్ ఠాకూర్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరాడు. 27 బంతుల్లో 2 సిక్సర్లతో 18 పరుగులు చేసిన ట్రావిస్ హెడ్, రవీంద్ర జడేజా బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీలు చేసిన స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్ ఇద్దరూ రెండో ఇన్నింగ్స్‌లో జడ్డూ బౌలింగ్‌లోనే అవుట్ కావడం విశేషం..
Read Also : Sreemukhi : అందం కోసం శ్రీముఖి ఇలాంటి పనులు చేస్తుందా?
111 పరుగుల వద్ద ఆసీస్ నాలుగో వికెట్ కోల్పోయింది. మార్నస్ లబుషేన్ 118 బంతుల్లో 4 ఫోర్లతో 41 పరుగులు, కామెరూన్ గ్రీన్ 27 బంతుల్లో ఓ ఫోర్‌తో 7 పరుగులు చేసి ప్రస్తుతం క్రీజులో ఉన్నారు. ఈ ఇద్దరినీ నాలుగో రోజు త్వరగా అవుట్ చేసినా ఆ తర్వాత అలెక్స్ క్యారీ, ప్యాట్ కమ్మిన్స్, మిచెల్ స్టార్క్ కూడా బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. ఆస్ట్రేలియా ఈజీగా రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియాకి 400 పరుగుల టార్గెట్ పెట్టేలా కనబడుతుంది. అదే జరిగితే టీమిండియా బ్యాటర్లపై కొండంత భారం పెట్టినట్లు అవుతుంది.
Read Also : Ram Charan: అటు తమ్ముడును.. ఇటు ఫ్రెండ్ ను సంతోషపెట్టిన చరణ్
అంతకుముందు ఓవర్ నైట్ స్కోరు 151/5 వద్ద మూడో రోజు బ్యాటింగ్ మొదలెట్టిన టీమిండియా, 296 పరుగులకి ఆలౌట్ అయ్యింది. శ్రీకర్ భరత్, మొదటి సెషన్ రెండో బంతికే అవుట్ అయ్యాడు. అయితే అజింకా రహానే, శార్దూల్ ఠాకూర్ కలిసి ఏడో వికెట్‌కి 109 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పి టీమిండియాని ఆదుకున్నారు.. అయితే వీరిద్దరి భాగస్వామ్యం కారణంగా మూడో రోజు మొదటి సెషన్లో ఒక్క వికెట్ కోల్పోయి 107 పరుగులు చేసిన టీమిండియా పూర్తి డామినేషన్ కనబర్చింది. అయితే 89 పరుగులు చేసి సెంచరీ వైపు సాగుతున్న అజింకా రహానే, లంచ్ బ్రేక్ తర్వాత అవుట్ అయ్యాడు. ఆ వెంటనే ఉమేశ్ యాదవ్ వికెట్ కూడా భారత జట్టు కోల్పోయింది.
Read Also : Renault Cars: కొత్త కారు కొనుగోలు చేయాలనుకుంటున్నారా.. ఆ కంపెనీ కార్లపై భారీ ఆఫర్..!
ఇక 51 పరుగులు చేసిన శార్దూల్ ఠాకూర్, ఓవల్‌లో వరుసగా మూడో 50+ స్కోరు నమోదు చేసి రికార్డు క్రియేట్ చేశాడు. శార్దూల్ ఠాకూర్ అవుటైన వెంటనే మహ్మద్ షమీ కూడా పెవిలియన్ చేరడంతో 300 మార్కుకి 4 పరుగుల దూరంలో టీమిండియా నిలిచిపోయింది. తొలి ఇన్నింగ్స్‌లో 469 పరుగులు చేసిన ఆస్ట్రేలియాకి 173 పరుగుల భారీ ఆధిక్యం దక్కింది.
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్‌కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!