Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. బంధాలకు, స్నేహానికి ఎంత విలువను ఇస్తాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా బెస్ట్ ఫ్రెండ్స్ కోసం ఏదైనా చేస్తాడు. ఇక రామ్ చరణ్- హీరో శర్వానంద్ చిన్ననాటి స్నేహితులు అన్న విషయం తెల్సిందే. శర్వా ప్రతి విషయంలో చరణ్ తోడుగా ఉంటాడు. ఇక తాజాగా శర్వా రిసెప్షన్ లో చరణ్ సతిసమేతంగా సందడి చేశాడు. శర్వా ఎంగేజ్ మెంట్ కు కూడా చరణ్- ఉపాసన విచ్చేశారు. ఇక పెళ్లి జైపూర్ లో కాబట్టి ఉపాసనను తీసుకెళ్లకుండా చరణ్ ఒక్కడే వెళ్లి వచ్చాడు. నేడు శర్వా రిసెప్షన్ కావడంతో అక్కడకు కూడా వెళ్లి స్నేహితుడును అతని భార్యను ఆశీర్వదించాడు. నిజం చెప్పాలంటే.. మెగా ఇంట కూడా నేడు నిశ్చితార్థం వేడుక జరుగుతున్న విషయం విదితమే.
Siddharth- Aditi: పెళ్లికొడుకు- పెళ్లి కూతురు కంటే.. వీళ్లపైనే అందరి కళ్లు ఉన్నాయే
మెగా బ్రదర్ నాగబాబు కుమారుడు, హీరో వరుణ్ , హీరోయిన్ లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం నాగబాబు ఇంట అతికొద్దిమంది బంధుమిత్రుల మధ్య జరిగిన విషయం తెల్సిందే. ఇక ఆ ఈవెంట్ ను చూసుకొని వరుణ్- లావణ్య రింగులు మార్చుకున్నాకా.. ఉపాసన తో కలిసి రిసెప్షన్ కు హాజరయ్యాడు చరణ్. ఉపాసన ప్రెగ్నెంట్ అయ్యిన దగ్గరనుంచి కొద్దిసేపు కూడా ఆమెను వదిలి ఉండడం లేదు చరణ్. శర్వా రిసెప్షన్ లో కూడా ఉపాసన చెయ్యి పట్టుకొని నడిపించిన తీరు ఆకట్టుకుంది. ఇక సింపుల్ డ్రెస్ లో చరణ్.. గ్రీన్ కలర్ డిజైనర్ డ్రెస్ లో ఉపాసన చూడముచ్చటగా ఉన్నారు. ప్రస్తుతం ఈ వీడియో, ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారాయి. అటు తమ్ముడును.. ఇటు ఫ్రెండ్ ను ఎవరికి బాధ కలగకుండా ఇద్దరి ఫంక్షన్స్ కు వెళ్లి సంతోష పెట్టాడు.