ఈ మధ్య కాలంలో హనీ ట్రాప్ పేరును ఎక్కువగా వింటున్నాము.. అందంతో యువకులను టార్గెట్ చేస్తూ దారుణంగా మోసం చేస్తున్నారు కిలేడీలు.. తాజాగా మరో లేడీ డేటింగ్ యాప్ పేరుతో యువకులను నైస్ గా మాయ చేసి ముగ్గులోకి దింపుతుంది. చివరికి సాంతం ఊడ్చేసింది.. మరో విషయమేంటంటే..తాజాగా ఐటీ కంపెనీలో పనిచేస్తున్న ఓ కిలేడీ డేటింగ్ యాప్‌లో ఓ వ్యక్తిని పరిచయం చేసుకుని హోటల్‌కు తీసుకెళ్లింది. అక్కడ ముందుగానే అనుకున్నట్లు లైంగిక దాడి జరిగినట్లు కలరింగ్ ఇచ్చింది.. అంతే ఇక ఆ గుట్టు బయట పడవద్దని డబ్బులను డిమాండ్ చేస్తుంది.. అంతే అడిగినంత సమర్పించుకోవాలి..
సదరు వ్యక్తి తప్పులేకున్నా కూడా లైంగిక దాడికి పాల్పడినట్టు డ్రామా క్రియేట్ చేసి డబ్బు కాజేయాలని ప్లాన్ వేసింది. ఈ క్రమంలో హానీట్రాప్‌కు దిగిన జంటను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన గురుగ్రామ్‌లో చోటుచేసుకుంది.. వివరాల్లోకి వెళితే.. బీహార్‌కు చెందిన బినితా కుమారి గురుగ్రామ్‌లోని ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తోంది. అలాగే, హర్యానా రోహతక్‌లోని భాలతో గ్రామానికి చెందిన 30 ఏళ్ల మహేశ్ ఫోగట్ ఓ ఎన్జీవోలో పని చేస్తున్నాడు. వీరిద్దరు కలిసి డేటింగ్ యాప్‌లో అమాయకులకు గాలం వేసి డబ్బులు వసూలు చేస్తున్నారు..
ఈ క్రమంలో ఓ వ్యక్తి తో యాప్ లో పరిచయం పెంచుకుంది.. గురుగ్రామ్ సెక్టార్-23లోని ఓ హోటల్‌కు రావాలని ఆఫర్ ఇచ్చింది. దీంతో, దొరికిందిలే ఛాన్ అని బాధితుడు హోటల్‌కు వెళ్లాడు.. అయితే, హోటల్‌కు వెళ్లిన తర్వాత ఊహించని విధంగా షాక్ తగిలింది. బినితా కుమారి సదరు వ్యక్తిని బీర్ తాగమని బలవంతం చేసింది. తాను ఊహించినదానికి పరిస్థితులు వేరుగా కనిపించడంతో బాధితుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కాగా, ఆ తర్వాత ఆయనకు ఫోన్ చేసి తనతో అసభ్యంగా ప్రవర్తించావని, లైంగికంగా వేధించావని బెదిరించింది… రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసింది.. ఆమె గురించి ఆలోచించేలోపే మహేష్ ఫోగట్ నుంచి బాధితుడికి ఫోన్ వెళ్లింది. రూ. 5 లక్షలు ఇస్తేనే సమస్య సెటిల్‌మెంట్ అవుతుందని బెదిరింపులకు దిగాడు.. ఇక భయపడిన వ్యక్తి రెండు లక్షలు ఇస్తానని ఒప్పుకున్నాడు..ఆ తర్వాత 50 ఇచ్చి పోలీసులను ఆశ్రయించాడు..రంగంలోకి దిగిన పోలీసులు వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.. ఇప్పటివరకు 12 మందిని మోసం చేసినట్లు ఒప్పుకున్నారు..
She is Binita Kumari
Known as B on Bumble
Befriended men on dating apps
Chose hotel as meeting place
Said she wants to have “beer & fun”
Few minutes into meeting cried Rape
Went to police & filed complaint
NGO guy then called to “strike deal”
The gang Extorted LACSARRESTED!! pic.twitter.com/rXDmX95HvM
— Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) June 8, 2023