Kieron Pollard: ముంబై ఇండియన్స్‌కు షాక్.. ప్రత్యర్థి జట్టులోకి కీరన్ పొలార్డ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kieron Pollard Leaves MI Camp and Joins CSK: వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్, టీ20 క్రికెట్ దిగ్గజం కీరన్ పొలార్డ్ మరోసారి వార్తల్లో నిలిచాడు. ప్రపంచవ్యాప్తంగా వివిధ ఫ్రాంచైజీ లీగ్‌లలో ఆడిన పొలార్డ్.. దశాబ్దకాలానికి పైగా అనుబంధం ఉన్న ముంబై ఇండియన్స్‌ను వీడి ప్రత్యర్థి చెన్నై సూపర్ కింగ్స్‌కు చెందిన ఫ్రాంచైజీలోకి అడుగుపెట్టబోతున్నాడు. రాబోయే SA20 సీజన్లో జొహన్నెస్‌బర్గ్ సూపర్ కింగ్స్ తరఫున పొలార్డ్ బరిలోకి దిగనున్నాడు. SA20 తదుపరి సీజన్‌కు జరుగుతున్న ప్లేయర్ల వేలంలో జొహన్నెస్‌బర్గ్ సూపర్ కింగ్స్ పొలార్డ్‌ను రూ.1.5 మిలియన్ రాండ్లకు దక్కించుకుంది. దీంతో ముంబై ఇండియన్స్‌తో సుదీర్ఘ అనుబంధం ఉన్న పొలార్డ్ తొలిసారి సీఎస్కేకు చెందిన ఫ్రాంచైజీ తరఫున ఆడబోతున్నాడు.
ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఐపీఎల్లో పోటీ తారాస్థాయిలో ఉంటుంది. ఈ రెండు జట్లను లీగ్‌లో ఆర్చ్ రైవల్స్‌గా కూడా పిలుస్తారు. అలాంటి ప్రత్యర్థి ఫ్రాంచైజీకి చెందిన జట్టులో పొలార్డ్ చేరడం ఇప్పుడు క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. పొలార్డ్‌కు ముంబై ఇండియన్స్‌తో ఉన్న అనుబంధం ప్రత్యేకమైనది. 2010లో ముంబై ఇండియన్స్‌లో చేరిన అతడు 2022 వరకు అదే జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. తన 12 ఏళ్ల ఐపీఎల్ కెరీర్లో మరో భారత ఫ్రాంచైజీ తరఫున ఆడకుండా ముంబైకే అంకితమయ్యాడు. ముంబై ఇండియన్స్ 2013, 2015, 2017, 2019, 2020 సీజన్లలో టైటిళ్లు గెలిచిన సమయంలో పొలార్డ్ జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నాడు.
Also Read
- Cristiano Ronaldo Retirement: అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రొనాల్డో గుడ్‌బై..! ఎమోషనల్ వీడియో విడుదల..
- Virat Kohli: కాలం ఎవరికీ ఆగదు.. విరాట్ కోహ్లీ ఆఖరి పోరాటం.. అయినా ఇంకా 14 కొట్టొచ్చు ఇలా!
- Jacob Duffy: కోహ్లీకి బౌలింగ్ చేయడం విసుగు తెప్పించింది.. ఆర్సీబీ ప్లేయర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- WBBL 2026: కీపర్ 'నో బాల్' బ్లండర్.. పొరపాటుతో తారుమారైన మ్యాచ్ రిజల్ట్.. రెనెగేడ్స్‌ను వరించిన అదృష్టం.!
ఐపీఎల్లో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముంబై ఇండియన్స్‌కు చెందిన ఫ్రాంచైజీలతోనూ పొలార్డ్ అనుబంధం కొనసాగింది. ILT20లో ఎంఐ ఎమిరేట్స్, మేజర్ లీగ్ క్రికెట్లో ఎంఐ న్యూయార్క్, SA20లో ఎంఐ కేప్‌టౌన్ జట్లకు అతడు ప్రాతినిధ్యం వహించాడు. ముఖ్యంగా SA20లో ఎంఐ కేప్‌టౌన్ తరఫున రెండు సీజన్లు ఆడిన తర్వాత ఇప్పుడు జొహన్నెస్‌బర్గ్ సూపర్ కింగ్స్‌లోకి మారుతున్నాడు. SA20లో పొలార్డ్ గత రెండు సీజన్లు పెద్దగా ఆడలేదు. 2025-26 సీజన్లో ఎంఐ కేప్‌టౌన్ తరఫున కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడి 20 పరుగులు చేశాడు. బౌలింగ్‌లోనూ ఒక్క వికెట్ తీయలేదు. అంతకుముందు 2023-24 సీజన్లో తొమ్మిది ఇన్నింగ్స్‌ల్లో 37.40 సగటుతో పరుగులు సాధించాడు. అదే సీజన్లో నాలుగు వికెట్లు పడగొట్టాడు.
ప్రస్తుతం 39 ఏళ్ల వయసులో ఉన్న పొలార్డ్ తన కెరీర్లో చివరి దశలో ఉన్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా టీ20 క్రికెట్లో అతడికి ఉన్న అనుభవం ఎంతో విలువైనది. ముఖ్యంగా యువ ఆటగాళ్లతో కలిసి పనిచేయడం, ఒత్తిడితో కూడిన మ్యాచ్‌ల్లో అనుభవాన్ని ఉపయోగించడం వంటి విషయాల్లో అతడి సేవలు జొహన్నెస్‌బర్గ్ సూపర్ కింగ్స్‌కు ఉపయోగపడే అవకాశం ఉంది. ఇప్పటివరకు ముంబై ఇండియన్స్‌కు చెందిన వివిధ జట్లకు ప్రాతినిధ్యం వహించిన పొలార్డ్.. ఇప్పుడు తొలిసారి సీఎస్కే కుటుంబంలోని జట్టుతో కలిసి పనిచేయబోతున్నాడు. ముంబై ఇండియన్స్ లెజెండ్‌గా గుర్తింపు పొందిన పొలార్డ్ ప్రత్యర్థి ఫ్రాంచైజీ జొహన్నెస్‌బర్గ్ సూపర్ కింగ్స్ తరఫున ఎలా రాణిస్తాడన్నది రాబోయే SA20 సీజన్లో ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
AP MPTC, ZPTC Elections: ఈ మండలాల్లో రేపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోలింగ్.. అక్కడ రీపోలింగ్‌కు ఎస్ఈసీ ఆదేశాలు!
-
Sreeleela: ఇక్కడ పక్కన పెట్టారు.. అక్కడ శ్రీలీల క్రేజ్ మామూలుగా లేదుగా!
-
Telangana Cabinet Decisions: కేబినెట్ కీలక నిర్ణయాలు.. ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా!
-
Kiran – Tej Forever: ఓ ఇంటివాడు కాబోతున్న సాయిదుర్గా తేజ్.. వధువు ఫోటో వైరల్!
-
Central Government Funds: గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. ఏపీ, తెలంగాణకు భారీగా నిధులు..
ట్రెండింగ్
-
Stock Market Rally: స్టాక్ మార్కెట్లో బుల్ జోరు.. సెన్సెక్స్ 2,000 పాయింట్ల జంప్.. ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..!
-
Virat Kohli: కాలం ఎవరికీ ఆగదు.. విరాట్ కోహ్లీ ఆఖరి పోరాటం.. అయినా ఇంకా 14 కొట్టొచ్చు ఇలా!
-
AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్..
-
9000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో Honor 700 సిరీస్.. Snapdragon 8 Gen 5 ప్రాసెసర్‌తో ప్రో మోడల్..!
-
భారత్‌లోకి Vivo X500 సిరీస్.. 400mm జూమ్‌తో ZEISS టెలిఫోటో లెన్స్‌తో రచ్చ.!