Bondi Beach Shooting: సామూహిక కాల్పులతో ఆస్ట్రేలియా ఒక్కసారిగా వణికిపోయింది. ఆదివారం సిడ్నీలోని బోండి బీచ్‌లో జరిగిన సామూహిక కాల్పుల్లో కనీసం 10 మంది మృతి చెందారు. అనేక మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఈ ఘోర సంఘటన తర్వాత పోలీసులు పర్యాటక ప్రాంతాల్లో భద్రతను మరింత పటిష్టం చేశారు. ఈ ఘటనలో అనేక మందిపై కాల్పులు జరిగాయని పలు నివేదికలు పేర్కొన్నాయి.
READ ALSO: Buggana Rajendranath: ప్రశ్నించడానికి పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్.. ఎందుకు ప్రశ్నించడం లేదు!
ఈ సంఘటన తర్వాత న్యూ సౌత్ వేల్స్ పోలీసులు మాట్లాడుతూ.. బీచ్, పరిసర ప్రాంతాలకు దూరంగా ఉండాలని ప్రజలను కోరుతూ హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపారు. అధికారులు రంగంలోకి దిగారని, పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని చెప్పారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలలో తుపాకీ చప్పులు, పోలీసు వాహనాల సైరన్లు వినిపించడంతో బీచ్‌కి వెళ్లేవారు ఆ ప్రాంతం నుంచి పారిపోతున్నట్లు కనిపించింది. పలువురు స్థానికులు మాట్లాడుతూ.. బోండి బీచ్‌లోని ఒక వంతెన దగ్గర నల్లటి దుస్తులు ధరించిన ఇద్దరు ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు, భయంతో ప్రజలు కేకలు వేస్తూ పరుగులు పెట్టినట్లు చెప్పారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. పోలీసుల కాల్పులలో ఒకరు మృతి చెందగా, మరొకరు పట్టుబడినట్లు పేర్కొన్నారు.
ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్ ప్రతినిధి మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితి ప్రభుత్వానికి తెలుసని అన్నారు. దర్యాప్తు కొనసాగుతుందని, తదుపరి ఆదేశాలు జారీ అయ్యే వరకు సమీపంలో నివసించే వారు, సందర్శకులు ఈ ప్రాంతానికి దూరంగా ఉండాలని తెలిపారు. సిడ్నీ తూర్పు తీరంలో ఉన్న బోండి బీచ్ 3,000 అడుగులకు పైగా విస్తరించి ఉంది. ఇది ఆస్ట్రేలియాలో అత్యంత గుర్తింపు పొందిన బీచ్‌లలో ఒకటి. ఇక్కడికి ప్రతిరోజూ వేలాది మంది సందర్శకులు వస్తుంటారు. ప్రస్తుతం జరిగిన ఈ కాల్పుల సంఘటన రద్దీగా ఉండే ఈ సముద్రతీరంలో తీవ్ర భయాందోళనలకు కారణం అయ్యింది. చాలా మంది ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పరుగులు తీశారు.
Active shooting at Bondi Beach in Sydney
Horrible footages
Looks like Zionist lobby started some massive false flag
Evils like Laura Loomer were signalling this for a while nowpic.twitter.com/uxdlle62qD
— Furkan Gözükara (@FurkanGozukara) December 14, 2025
READ ALSO: BJP: ప్రధాని మోడీని ‘‘అంతం’’ చేయడమే లక్ష్యమా..? కాంగ్రెస్ ‘‘ఓట్ చోరీ’’ ర్యాలీలో విద్వేష వ్యాఖ్యలు..