బంగ్లాదేశ్‌లో హిందువుల పరిస్థితి నానాటికి దిగజారుతోంది. ఇటీవల హిందూ నాయకుడు చిన్మోయ్ కృష్ణదాస్ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయన ఆ దేశ జాతీయ జెండాను అగౌరవపరిచారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కృష్ణదాస్‌కు బెయిల్ కూడా నిరాకరించారు. ఇస్కాన్ ప్రచారకర్త చిన్మయ్ కృష్ణదాస్ ప్రభు ను వెంటనే విడుదల చేయాలని హిందూ సంఘాలు, ప్రజానికం నిరసనలు చేపట్టారు. వారిపై స్థానిక ముస్లింలు విచ్చలవిడిగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడులు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నిన్న ప్రధాని…
ఇదిలా ఉంటే, తనపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో హిందువులు సంఘటితమయ్యారు. రాజధాని ఢాకాతో పాటు పలు ప్రాంతాల్లో స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. ఈ నేపధ్యంతో తాత్కాలిక ప్రభుత్వాధినేతగా ఉన్న మహమ్మద్ యూనస్ ఈ రోజు హిందూ నాయకులను కలుసుకున్నారు. మంగళవారం ఢాకాలోని ఢాకేశ్వరి జాతీయ ఆలయాన్ని సందర్శించిన తర్వాత ప్రజలు ఓపికతో మెలగాలని, ఐక్యత కోసం పిలుపునిచ్చారు. ప్రతీ ఒక్కరికి మతంతో సంబంధం లేకుండా హక్కులు ఉన్నాయని అన్నారు.