హైదరాబాద్ లోని హీరో అల్లు అర్జున్ ఇంటిని ముట్టడించేందుకు ఓయూ జేఏసీ యత్నించింది. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కుటుంబాన్ని ఆదుకోవాలని నినాదాలు చేశారు. రేవతి కుటుంబానికి రూ. కోటి ఇచ్చి అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలైన సంగతి తెలిసిందే. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో నిన్న పోలీసులు అరెస్ట్ చేయడంతో అల్లు అర్జున్ ని చంచల్గూడ జైలుకు తరలించారు పోలీసులు. అయితే ఈరోజు ఉదయం 6:30 గంటల సమయంలో అల్లు అర్జున్ ని పోలీసులు విడుదల చేశారు. దీంతో ఆయన జూబ్లీహిల్స్ లో నివాసానికి వెళ్లారు. ఇక ఒక్కరు ఒక్కరుగా సినీ ప్రముఖులు ఆయన నివాసానికి తరలి వెళ్తున్నారు. ముందుగా మైత్రి నిర్మాతలు రవి, నవీన్ తో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో నిన్న అరెస్టయి ఒక రాత్రంతా చంచల్ గూడా జైల్లో గడిపిన అల్లు అర్జున్ ఈ రోజు ఉదయం 6:30 గంటల సమయంలో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ముందుగా అక్కడ నుంచి గీతా ఆర్ట్స్ ఆఫీస్ కి వెళ్ళిన అల్లు అర్జున్ ఆ తర్వాత జూబ్లీహిల్స్ లోని నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి తీవ్ర భావోద్వేగానికి గురైంది. అల్లు అర్జున్ కూడా భావోద్వేగానికి గురై…